Weight Loss: రైస్ తింటూ కూడా ఈజీగా బరువు తగ్గచ్చు తెలుసా?

Published : Mar 05, 2025, 01:00 PM IST

బరువు తగ్గాలనుకునే వారు ఫస్ట్ చేసే పని రైస్ తినడం మానేయడం. కానీ రైస్ తింటూ కూడా బరువు తగ్గవచ్చనే విషయం మీకు తెలుసా? అదేలాగా అనుకుంటున్నారా? అయితే చూసేయండి మరి.

PREV
16
Weight Loss: రైస్ తింటూ కూడా ఈజీగా బరువు తగ్గచ్చు తెలుసా?

ప్రస్తుతం చాలామంది అధిక బరువు వల్ల ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని అనుకునేవాళ్లు రైస్ తినడం పూర్తిగా మానేస్తుంటారు. అన్నంలో కార్బోహైడ్రేడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారని అందరికీ తెలుసు. కానీ, కొంతమంది ఒక్కపూట కూడా రైస్ తినకుండా ఉండలేరు. కానీ బరువు తగ్గాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్ల మైండ్ లో వచ్చే ఫస్ట్ ప్రశ్న రైస్ తింటూ  బరువు తగ్గలేమా అని. 

రైస్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. అంతేకాదు బరువును త్వరగా తగ్గిస్తాయి. మరి ఏ రైస్ బరువు తగ్గడానికి సాయపడుతుందో ఇక్కడ చూద్దాం.

26
బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో ఎక్కువగా విటమిన్ బి, ఫైబర్ ఇంకా మినరల్స్ ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది కాబట్టి ఆకలి వేయదు. దీనివల్ల ఎక్కువగా తినలేము కూడా. ఇంకా బ్రౌన్ రైస్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల, ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.

36
బాస్మతి రైస్

బాస్మతి రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ రైస్ ని ఆయిల్ లేదా నెయ్యి లేకుండా వండితే బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు.

46
బ్లాక్ రైస్

బ్లాక్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ రైస్ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బరువుని కంట్రోల్ చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రైస్ లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

56
కేరళ మట్టా రైస్

కేరళ రెడ్ రైస్ అని పిలిచే వీటిలో ఫైబర్ చాలా ఎక్కువ. ఇది బరువు తగ్గడానికి చాలా మంచిది. ఈ రైస్ లో ఉండే ఫైబర్ కడుపుని ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. ఈ రైస్ లో ఎసెన్షియల్ న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల అవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువుని కంట్రోల్ చేస్తాయి.

66
సామ రైస్

సామ రైస్ గ్లూటెన్ లేని ధాన్యం. ఈ రైస్ లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఈ రైస్ తింటే తొందరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువుని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రైస్ లో న్యూట్రియన్స్ ఉండటం వల్ల ఇది శరీరంలో న్యూట్రియన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories