Latest Videos

రక్తహీనతతో బాధపడుతున్నారా..? అమ్మమ్మ సీక్రెట్ ఫాలో అవ్వాల్సిందే..!

First Published May 23, 2024, 12:30 PM IST

హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల.. ఆయాసం, తలనొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. 

anemia

ఈ రోజుల్లో చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.  శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రక్తహీనత వలనే అనేక వ్యాధులు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. శరీరంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి లోపం ఉన్నప్పుడు హిమోగ్లోబిన్  తగ్గడం ప్రారంభం అవవుతుంది.

anemia

హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల.. ఆయాసం, తలనొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు.. సరైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. చాలా మందికి దీని కోసం  మందులు వాడుతూ ఉంటారు. కానీ.. ఈ సమస్యకు  అమ్మమ్మలు ఎప్పుడో పరిష్కారం చెప్పారు. ఈ అమ్మమ్మ చిట్కా వాడితే...  మీకు రక్త హీనత అనేది ఉండదు. అదేంటో ఓసారి చూద్దాం.

mulberry


కేవలం ఒక పండు జ్యూస్ తాగడం వల్ల  ఈ రక్త హీనత అనేది ఉండదట. అదేంటో కాదు.. మల్బరీ జ్యూస్.  మీరు వేసవిలో తీపి, పులుపుగా ఉండే మల్బరీ పండ్లను అమ్మడం చూసి తప్పకుండా తినాలి. ఇది తింటే రుచిగా ఉంటుంది. అలాగే, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి ఆకుపచ్చ , నలుపు రంగులో ఉంటాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ సి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

mulberry

దీని రసం లేదా ఈ పండును నేరుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత నయమవుతుంది. మల్బరీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

రక్తహీనత ఉన్నవారు ముఖ్యంగా ఈ పండు లేదా దాని రసం తీసుకోవాలి. ఇది జీవక్రియను పెంచుతుంది .శరీరంలో విటమిన్ సి స్థాయిని కూడా నిర్వహిస్తుంది. దీని రసం ఎముకలను బలపరుస్తుంది. ఈ రసం మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
 

ఈ మల్బరీ జ్యూస్ ఎలా తయారు చేయాలో చేద్దాం...
మిశ్రమంలో మల్బరీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని.. ఫిల్టర్ చేసుకోవాలి.  కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు. సమ్మర్ కాబట్టి.. చల్లగా ఉండటానికి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ని  రెగ్యులర్ గా తాగితే.. మీ రక్త హీనత పారిపోతుంది.

click me!