చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే.. మీకు తిరుగేలేదు..!

First Published Dec 24, 2020, 11:21 AM IST

అసలు చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

చలికాలంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. చలికాలంలో వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు. తుమ్ములు, దగ్గులు, జలుబు, జ్వరం లాంటివి పిలవకున్నా వచ్చేస్తాయి. దానికి తోడు.. ప్రస్తుతం అసలే కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆరోగ్యాన్ని పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంది.
undefined
మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మరి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అంటే.. దానికి తగినట్లు ఆహారాలు తీసుకోవాలి.
undefined
అసలు చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ ఆహారం తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
undefined
చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మూడు విటమిన్స్.. మూడు ఆహార పదార్థాల్లో చాలా పుష్కలంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
1. బాదం.. చలికాలంలో ముందుగా తినాల్సిన ఆహారాల్లో బాదం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. వీటిలో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని మరింత పెంపొందిస్తాయి. దీనిలో ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల డయాబెటీస్ రాకుండా కాపాడుకుంతి. గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.
undefined
2. అల్లం.. అల్లంలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. చలికాలంలో అల్లం టీ తాగడం చాలా మంచిది.
undefined
3.కివీ ఫ్రూట్.. ఈ పండు తినడం చాలా మంచిది. దీనిలో కూడా విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. దీనితోపాటు.. నారింజ, జామపండు , నిమ్మకాయ లాంటివి కూడా తీసుకోవడం ఉత్తమం.
undefined
click me!