గుమ్మడిపండులాంటి సంతానం కావాలా? అయితే గుమ్మడికాయ తినాల్సిందే....

First Published | Dec 20, 2020, 12:10 PM IST

గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకే తల్లి కావాలనుకునే మహిళలు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది.  

గుమ్మడి కాయ.. ఇది చాలామంది ఇష్టపడరు. దిష్టికి తప్ప వాడరు. ఇక సంక్రాంతి సీజన్ వచ్చిందంటే గుమ్మడికాయలు చాలా విరివిగా దొరుకుతాయి. కానీ వాటిని రెగ్యులర్ గా తినేవాళ్లు తప్ప, కొత్తవాళ్లు ట్రై చేయరు. అయితే ఒక్కసారి కనుక గుమ్మడికాయలో ఉన్న ఆరోగ్య లక్షణాలు అది చేసే మేలు తెలిస్తే మాత్రం.. ఇక ఎప్పటికీ వదిలిపెట్టరు.
సంతాన సమస్యలు, గుండె సమస్యలతో బాధపడేవారు గుమ్మకాయ కూరను వారానికి ఒక్కసారి తింటే చాలట. గుమ్మడి కాయతో పాటు గుమ్మడి గింజలను సైతం తప్పకుండా మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి.

గుండె సమస్యలు ఉన్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడి కాయను కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచ్చు, విటమిన్‌లు గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి.
గుమ్మడి కాయను కోస్తే దాంట్లోని పీచు లక్షణం తెలిసిపోతుంది. అంతేకాదు గుమ్మడి గింజల నుంచి శరీరానికి కావలసినంత ఫైబర్ లభిస్తుంది.
కూరగానో, పులుసుగానో, సాంబార్ లోనో గుమ్మడి ముక్క ఒక్కటి తగిలిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అలా తినలేం అనుకుంటే గుమ్మడి వడియాలు పెట్టుకుని కూడా ట్రై చేయచ్చు.
వంద గ్రాముల గుమ్మడి గింజల్లో 18 గ్రాముల ఫైబర్ ఉంటుందట. అంతేకాదు గుమ్మడి గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. గుమ్మడి గింజలు ఈ ఫ్రీ రాడికల్స్‌ను కంట్రోల్ చేస్తాయి
గుమ్మడిలోని పొటాషియం అధిక రక్తపోటు సమస్యను నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా గుమ్మడి నిరోధిస్తుంది. వీటితో పాటు కంటి చూపుకు కూడా గుమ్మడి ఎంతో మంచిది.
ఇక నాన్ వెజ్ తినని వారికి, చేపలు ఇష్టపడని వారికి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కోసం బెస్ట్ సోర్స్ గుమ్మడి గింజలే. శరీర కణాలను సక్రమంగా పనిచేసేందుకు గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి. ఊబకాయం రాకుండా కూడా గుమ్మడి గింజలు అడ్డుకుంటాయి.
గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. అందుకే తల్లి కావాలనుకునే మహిళలు గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వీటితోపాటు గుమ్మడి వడియాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.
గుమ్మడి కాయ లేదా గింజలు హార్లోన్ల అసమతుల్యతను తగ్గించడానికి సహకరిస్తాయి. దీంతోపాటువ్యాధినిరోధక శక్తిని పెంచి, వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా గుమ్మడి కాయ కాపాడుతుంది.

Latest Videos

click me!