పాలు ఎన్నిరోజులు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయచ్చు..?

First Published | Dec 16, 2020, 2:50 PM IST

పాలను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రతిఒక్కరికీ ఉన్న సందేహాలలో ఒకదానికి మొదట సమాధానం చూద్దాం. పాలను ఫ్రిజ్‌లో ఎంతసేపు నిల్వ చేయవచ్చు?

పాలు.. ప్రతిరోజూ మనం ఇంట్లో ఉపయోగిస్తాం. లేవగానే టీ గానీ, కాఫీ గానీ తాగలన్నా కూడా పాలు కావాల్సిందే. అంతేకాదు.. పెరుగు లేకుండా భోజనం కూడా పూర్తి అవ్వద్దు. దానికి కూడా పాలు కావాల్సిందే. అంటే పాలు లేకుండా మనకు రోజు గడవదు అనే చెప్పొచ్చు. కాగా.. పాలు ఎక్కువ సేపు నిల్వ ఉండవు కాబట్టి.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కదా. అసలు పాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది.
అయితే.. కొన్ని చిట్కాలు తీసుకుంటే పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

పాలను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిఒక్కరికీ ఉన్న సందేహాలలో ఒకదానికి మొదట సమాధానం చూద్దాం. పాలను ఫ్రిజ్‌లో ఎంతసేపు నిల్వ చేయవచ్చు?
పట్టణాల్లో నివసించేవారందరివీ దాదాపు ఉరుకుల పరుగుల జీవితమే. ఇలాంటి జీవితంలో పాలు సమయానికి ఉపయోగించలేం. దీంతో.. త్వరగా పాడైపోతాయి.
దాదాపు ఈ రోజుల్లో చాలా మంది పాల ప్యాకెట్లేవాడుతూ ఉంటారు. కాగా..ఈ ప్యాకెట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచి ఉపయోగించుకోవచ్చు. అయితే.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానిని ఉపయోగించడం బెటర్.
పాలు ఫ్రీజర్‌లోని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. స్థలం 1-1.5 అంగుళాలు ఉండాలి. ఫ్రీజర్‌లో మాంసం లేదా చేపలను నిల్వ చేసినా, పాలు దాని నుండి వచ్చే వాసనను సులభంగా గ్రహిస్తుంది.
అది తరువాత చల్లబడినప్పుడు మాత్రమే మనం దానిని గుర్తించగలము. అందుకే దీనిని శుభ్రంగా ఉంచి మూతవేసి ఉంచాలి. లేదంటే వాటి వాసన పాలు పట్టేస్తాయి. పాలు కూడా అవే వాసన వస్తాయి.
పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఓ సులభమైన మార్గం ఉంది. ఫ్రిడ్జ్ లోని ఐస్ క్యూబ్ ట్రేలో పాలు పోసి ప్రీజ్ చేస్తే.. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆ పాల క్యూబ్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.
ఒక వేళ పాల ప్యాకెట్ గడ్డగడితే.. ఆ ప్యాకెట్ ని నార్మల్ వాటర్ లో ఉంచితే.. కొద్దిసేపటికే అవి నార్మల్ అవుతాయి. తర్వాత వాటిని వినియోగించుకోవచ్చు.

Latest Videos

click me!