అత్యంత ఖరీదైన పన్నీర్.. ధర ఎంతో తెలుసా..?

First Published | Jun 27, 2022, 8:41 AM IST

కానీ కేజీ పన్నీర్ రూ.70వేలకు ఎప్పుడైనా కొన్నారా..? పన్నీర్ ఎక్కడైనా అంత రేటు ఉంటుందా అని నోరెళ్లపెట్టకండి. నిజంగానే పన్నీర్ ధర అలా ఉంది. అత్యంత ఖరీదైన పన్నీర్ ఇది.

పన్నీర్.. ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్. మాంసాహారం తినని వారికి అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ అందాలి అంటే.. వారి దగ్గర ఉన్న ఏకైక మార్గం.. పన్నీర్. పాలతో తయారు చేసే ఈ పనీర్ పోషకాల గని. ప్రోటీన్స్ తో పాటు కాల్షియం, విటమిన్లు కూడా ఇందులో ఉంటాయి. 

అయితే.. ఈ పనీర్ ని మీరు ఎంతకు కొనుగోలు చేశారు..? మహా అయితే.. రూ200, రూ.300లకు కొనుగోలు చేసి ఉంటారు. కానీ కేజీ పన్నీర్ రూ.70వేలకు ఎప్పుడైనా కొన్నారా..? పన్నీర్ ఎక్కడైనా అంత రేటు ఉంటుందా అని నోరెళ్లపెట్టకండి. నిజంగానే పన్నీర్ ధర అలా ఉంది. అత్యంత ఖరీదైన పన్నీర్ ఇది.


ఈ పన్నీర్ అంత ఖరీదు ఉండటానికి కారణమేంటో తెలుసా..? దీనిని సాధారణంగా గేదె, ఆవు పాలతో కాకుండా... గాడిద పాలతో తయారు చేస్తారు. అందుకే దీనికి ఇంత విలువ... అంత రేటు కూడాను.

గాడిద పాలలో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. అందుకే గాడిదపాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీనివల్లే పనీర్ కూ చాలా డిమాండ్ పెరిగిందట. తల్లిపాలలో ఉండే ఆరోగ్య లక్షణాలన్నీ గాడిద పాలలో ఉంటాయి

అంతేకాదు అనేక రకాల ఆరోగ్యసమస్యలకు గాడిదపాలు తల్లిపాలకంటే ఎక్కువగా పనిచేస్తాయి. చిన్న పిల్లలకు ఉబ్బసం లాంటి వ్యాధులు రాకుండా తాగిస్తారు. ఉబ్బసం బారిన పడిన పెద్దవారు కూడా ఈ పాలు ఎంతో మంచివి. 

అందుకే లీటర్ గాడిద పాల ధర 6,7 వేల ధర పలుకుతుంది. ఇక పన్నీర్ అయితే ఏకంగా కేజీ పన్నీర్ ధర రూ.70 వేలకు పైమాటే కావడం గమనార్హం. ఈ పన్నీర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది సెర్బియాలో దొరికే పన్నీర్ కావడం గమనార్హం.
 

సెర్బియాలోని అత్యంత ప్రసిద్ధ సహజ నిల్వలలో ఒకటైన జసావికాలో ఉత్పత్తి చేయబడుతుంది. గాడిద పాలను ఉపయోగించి తయారు చేసే పన్నీర్ ని  పూలే అని కూడా అంటారు.

దాదాపు 25 లీటర్ల తాజా గాడిద పాలతో  కేజీ పన్నీర్ తయారౌతుందట.అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పన్నీర్ కావడం గమనార్హం.

అత్యంత ఖరీధైన ఈ పనీర్ ను విదేశీయులు ఎక్కువగా వాడతారు. అంతేకాదు గాడిద పాలతో సబ్బులు,  షరబ్‌లను కూడా తయారు చేస్తారు.
 

Latest Videos

click me!