తెలుగు రాష్ట్రాల్లో అందరూ అన్నం ఎక్కువగా తింటారు. ఇతర రాష్ట్రాల్లో రోటీలు, బ్రెడ్లు తిన్నా.. మనం మాత్రం రైస్ కే ప్రాధాన్యం ఇస్తాం. ఒక్కోరోజు ఎక్కువ తింటాం.. ఒక్కోరోజు తక్కువ తింటాం. ఈ క్రమంలో ఒక్కోసారి వండిన అన్నం మిగిలిపోతూ ఉంటుంది. దాంతో.. చాలా మంది అదే అన్నం మరుసటిరోజు తింటారు. లేదంటే కొందరు.. దానిని పారేస్తారు.
అయితే.. మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. సూపర్ స్నాక్.. చిన్న పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ రైస్ స్నాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..మిగిలిపోయిన అన్నం అరకప్పుపెరుగు అరకప్పుగోధుమ పిండి 2 కప్పులుఉల్లిపాయ ఒకటిపచ్చిమిరపకాయలు 3కరివేపాపుఉప్పు తగినంత.
తయారీ విధానం..ముందుగా.. ఒక గిన్నెలో అన్నం తీసుకోవాలి. దాంట్లో పెరుగు వేసి బాగా కలపాలి. దాంట్లో సరిపడ ఉప్పు.. గోదుమ పిండి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి.
తర్వాత దీనిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని.. దానిని వేడి చేయాలి.
ప్యాన్ వేడి అయిన తర్వాత.. ఈ ఉండలను చిన్నపాటి చపాతీల్లాగా చేతితో ఒత్తుకొని.. ప్యాన్ మీద రెండు వైపులా కాల్చుకోవాలి. నూనె, నెయ్యి వేసి కాల్చుకోవచ్చు.
వీటిని ఏదైనా కర్రీ, చట్నీ, సాంబారుతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి.