ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు పెరిగిపోయారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయమేమీ కాదు. దీని వల్ల భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి.
కాలేయంలో కొవ్వు పేరుకుపోతే.. ఆ ప్రాంతంలో వాపు వస్తుంది. కణాలు దెబ్బ తింటాయి. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి.
మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే.. ఇదిగో.. ఈ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
గ్రీన్ టీ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, కొవ్వు కాలేయాన్ని నివారించడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి శరీర కొవ్వును తగ్గించడానికి మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి సహాయపడతాయి.
ఆహారానికి రుచిని పెంచడంతోపాటు.. వెల్లుల్లి శరీర కొవ్వు తగ్గడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయంలో అధిక కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన వాల్‌నట్స్ కాలేయ ఆరోగ్యానికి మంచివి. ఇది కాలేయానికి మంచిది మాత్రమే కాదు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
ఆకు కూరలు కాలేయ కొవ్వును తగ్గించడానికి, శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఆకు కూరలను ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
సోయా ఉత్పత్తుల్లో కొవ్వు తక్కువగా ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కాలేయం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.