బంగాళదుంప అటుకుల టిఫిన్... వేడివేడిగా తింటే.....

First Published | Jun 7, 2021, 4:45 PM IST

అలూ పోహ... టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ, ఈవినింగ్ టీ లేదా కాఫీతో స్నాక్స్ గా కానీ దీన్ని తినొచ్చు. 
 

అలూ పోహ... టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ, ఈవినింగ్ టీ లేదా కాఫీతో స్నాక్స్ గా కానీ దీన్ని తినొచ్చు.
ఇది చాలా లైట్ గా ఉండి తొందరగా అరిగిపోతుంది. దీన్ని లంచ్ బాక్స్ లో ఈజీగా ప్యాక్ చేయచ్చు. అంతేకాదు ఇదే కాంబినేషన్ లో పోహా బ్రెడ్ రోల్స్, పోహా కట్లెట్స్, పోహా బాల్స్ లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు.

కూరగాయలు బాగా తినాలని ఇష్టపడేవారు.. ఈ పోహాలో మీకు నచ్చిన కూరగాయలను వేసుకోవచ్చు. దీనికి వేయించిన పల్లీలు వేస్తే రుచి అదుర్స్.
ఆలూ పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు4 సేర్విన్గ్స్2 కప్పుల అటుకులు2 తరిగిన ఉల్లిపాయ4 తరిగిన పచ్చిమిర్చి12 టీస్పూన్ ఆవాలు2 టీస్పూన్ శనగపప్పు4 కరివేపాకు రెమ్మలు2 ఉడికించి, తొక్కతీసి మెత్తగా చేసిన బంగాళాదుంప2 టీస్పూన్ తురిమిన క్యారెట్4 టీస్పూన్ వర్జిన్ ఆలివ్ ఆయిల్2 టీస్పూన్ మినపపప్పు2 టీస్పూన్ల ఉప్పుగార్నిషింగ్ కోసం2 స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర
ఆలూ పోహా తయారు చేసే విధానం...ఆలూపోహా కోసం ముందుగా బంగాళాదుంపలను కుక్కర్లో వేసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత కుక్కర్లో నుంచి తీసి వేరే గిన్నెలో పెట్టకుని పక్కన పెట్టేయాలి. అటుకులను వేరే గిన్నెలో తీసుకుని దాని మీద నీళ్లు చల్లి కలిపి ఓ 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి.
ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేసి అందులో కరివేపాకు, ఆవాలు, మినపపప్పు, శనగ పప్పు వేసి 30 నుంచి 45 సెకన్ల పాటు వేయించాలి. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళాదుంపలు, క్యారెట్, ఉప్పు వేసి బాగా కలపండి. ఆ తరువాత నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు నీళ్లు చల్లి పక్కన పెట్టుకున్న పోహాను నీళ్లు లేకుండా డ్రై గా తీసి పాన్ లో వేసి బాగా కలపండి.
బాగా వేగిన తరువాత స్టౌ ఆఫ్ చేసి పైన కొత్తిమీరతో అలంకరించండి. వేయించిన పల్లీలు కూడా ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 5 నిమిషాల పాటు మూతపెట్టి అలాగే ఉంచండి. దీన్ని ఉదయం అల్పాహారంగానూ, సాయంత్రం టీతోపాటు స్నాక్ గానూ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Latest Videos

click me!