సమ్మర్ లో బరువు తగ్గడం కొంచెం కష్టమైన పని అని అందరూ అంటూ ఉంటారు. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఎంత కష్టమైనా సులువుగా బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చనేది నిపుణుల వాదన.
undefined
శరీరంలోని డీటాక్స్ ని బయటకు తొలగించినప్పుడు.. మనం సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. అలా శరీరంలోని డీటాక్స్ తొలగించడంలో ఓ కూరగాయ మ్యాజిక్ చేస్తుందట.
undefined
సమ్మర్ లో శరీరాన్ని కూల్ చేయడంతోపాటు.. సులువుగా బరువు తగ్గించడంలో ఈ కూరగాయ కీలక పాత్ర పోషిస్తుంది. అదే సొరకాయ. సొరకాయతో చేసిన నీరు తాగడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చట. కొన్ని రోజులు ఈ నీరు తాగడం వల్ల మీ శరీరంలోని మార్పును మీరే గమనించగలరట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined
సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమ్మర్ కి ఫర్పెక్ట్ గా సూట్ అవుతుంది. అంతేకాదు.. దీనిలో విటమిన్ సీ, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ ఈ ,ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
undefined
ఈ సొరకాయ నీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా.. రోగ నిరోధక శక్తని పెంపొందించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది.
undefined
మరి ఈ సొరకాయ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
undefined
ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి... దాని తొక్కు తీసి.. ముక్కలుగా కోసుకోని పక్కన పెట్టుకోవాలి.తర్వాత సొరకాయ ముక్కలను ఆరు ఏడింటిని ఒక జారులో తీసుకోవాలి. అందులో కొద్ది సోంపు వేయాలి. తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేయాలి. తర్వాత అందులో నిమ్మ తొనలు కూడా వేయాలి. ఆ తర్వాత అందులో నిండుగా వాటర్ పోయాలి.
undefined
తర్వాత ఆ జార్ ని రాత్రంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి. తర్వాతి రోజు.. ఆ నీటిని రోజంతా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
undefined