లెమన్ గ్రాస్ రైస్ : అన్నంతో ఈ వెరైటీ ఎప్పుడైనా ట్రై చేశారా...

First Published | Jun 14, 2021, 5:04 PM IST

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.
ముఖ్యంగా ఎండాకాలం సాయంత్రాలు ఏదైనా లైట్ గా తినాలనిపించినప్పుడు స్నాక్ గా ఇది చాలా బాగుంటుంది. వాసనకే నోట్లో నీళ్లూరించే ఈ వంటకం థాయ్ కూరలతో బాగుంటుంది. ఇక ఇంట్లో చిన్నపాటి పార్టీలు చేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకోదగిన స్పెషల్ వంటకం ఇది.

లెమన్ గ్రాస్ రైస్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు2 కప్పుల బియ్యం3 టీస్పూన్ల వెజిటెబుల్ ఆయిల్2 12 టేబుల్ స్పూన్ల లెమోన్గ్రాస్ స్టాక్4 అంగుళాల తురిమిన అల్లం2 ఉల్లిపాయలు1 టేబుల్ స్పూన్ల సోయా సాస్2 12 టీస్పూన్ల వెన్న2 కట్టల ఉల్లికాడలు, సన్నగా తరగాలి
రుచికి తగినంత ఉప్పు4 కప్పుల నీరు4 వెల్లుల్లి రెబ్బలు1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ తరుగు4 పచ్చిమిర్చి12 టేబుల్ స్పూన్ల వర్సెస్‌షైర్ సాస్కొద్దిగా కొత్తిమీర
లెమన్ గ్రాస్ రైస్ రైస్ తయారు చేసే విధానం..బియ్యాన్ని నానబెట్టాలి : ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న లెమన్ గ్రాస్ ను ఒక కుక్కర్ లో వేసి.. బియ్యానికి రెండింతలు నీళ్లు పోయాలి. ఈ నీటికి కొద్దిగా వెజిటబుల్ ఆయిల్ కలపాలి.
అన్నం వండడం : దీనికే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, వెన్న, పచ్చిమిర్చి, సోయా సాస్, వోర్సెస్టర్‌షైర్ సాస్‌తో పాటు రుచికి తగినంత ఉప్పు వేసి మీడియం-తక్కువ వేడి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి.
అన్నం ఉడికిన తరువాత పైన పేరుకుపోయిన లెమన్ గ్రాస్ ముక్కలను తీసేయండి. తరువాత మంటను ఆపేసి.. ముందుగా తరిగి పెట్టకున్న ఉల్లికాడలతో అలంకరించండి. దీనికే కొత్తిమీర కూడా చేర్చండి.
ఇలా తయారైన లెమన్ గ్రాస్ రైస్ ను రైతా లేదా ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Latest Videos

click me!