ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఎప్పుడు ఎవరు కరోనా మహమ్మారికి బలి కావాల్సి వస్తుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఆరోగ్యంగా ఉన్నారులే అనుకున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే తొందరగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిపై పోరాటం చేయాలంలే.. విటమిన్స్, జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా ఉండే ఆహారాలు ఏంటి..? ఏ ఫుడ్స్ రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోదక శక్తి బాగా పెరుగుతుందో తెలుసుకుందాం..
1. సిట్రస్ ఫ్రూట్స్... వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఈ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల శరీంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. ఈ తెల్ల రక్తకణాలు.. మన శరీరంపై ఇన్ఫెక్షన్లు దాడి చేసినప్పుడు.. వాటితో ఇవి పోరాడతాయి. ఇవి తక్కువగా ఉంటే.. క్రిములపై పోరాటం చేయలేక అనారోగ్యానికి గురౌతూ ఉంటాం. కాబట్టి.. ప్రతిరోజూ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆరెంజ్, నిమ్మ, బత్తాయి లాంటివి సిట్రస్ ఫ్రూట్స్ కిందకు వస్తాయి.
2.ఓట్స్... ఓట్స్ లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
3. బెర్రీస్.. బ్లూ బెర్రీస్, రాస్ బెర్రీస్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో జింక్, న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
4.చేప.. ప్రతిరోజూ చేపను ఆహారంగా తీసుకోవడం కూడా చాలా అవసరం. శరీరానికి కావాల్సిన ఐరన్, జింక్, ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో పుష్కలంగా ఉంటాయి.
5. బ్రొకోలి.. దీనిలోనూ విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అన్ని కూరగాయల్లో కెల్లా.. ఆరోగ్యకరమైన కూరగాయ ఈ బ్రొకోలి కావడం విశేషం.
ఈ ఐదు ఆహారాలను ప్రతిరోజూ మీ ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యం మీ వెంట ఉన్నట్లే.. కరోనా మహమ్మారి సోకినా.. మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి.. ఈ ఆహారాలను కచ్చితంగా తీసుకోవడం అవసరం.