స్కూల్ పిల్లలకు క్విక్ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ లు

First Published | Nov 15, 2023, 3:51 PM IST

పిల్లలకు మనం మామూలుగా ఇంట్లో చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లనే ఇంకాస్త ఆరోగ్యంగా మార్చి, వారికి తినిపించాలి. అదేవిధంగా ఆ బ్రేక్ ఫాస్ట్ రుచిగా కూడా ఉండేలా చూసుకోవాలి. మరి, ఆ బ్రేక్ ఫాస్ట్ లు ఏంటో ఓసారి చూద్దాం...
 

పిల్లలు ఫుడ్ తినడానికి ఎక్కువగా మారాం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం లేచి, స్కూల్ కి రెడీ వెళ్లే సమయంలో బ్రేక్ ఫాస్ట్ తినడానికి ఎక్కువ సమయం ఉండదు. సరిగా కడుపు నిండా తినరు. దాని వల్ల, వారి కడుపు నిండదు, వారి ఆరోగ్యం ఏమైపోతుందా అని తల్లులు బెంగపడుతూ ఉంటారు. అయితే, పిల్లలకు మనం మామూలుగా ఇంట్లో చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లనే ఇంకాస్త ఆరోగ్యంగా మార్చి, వారికి తినిపించాలి. అదేవిధంగా ఆ బ్రేక్ ఫాస్ట్ రుచిగా కూడా ఉండేలా చూసుకోవాలి. మరి, ఆ బ్రేక్ ఫాస్ట్ లు ఏంటో ఓసారి చూద్దాం...
 

1.ఇడ్లీ..
ఇడ్లీ ప్రతి ఇంట్లో చేసేదే. కానీ, ఆ ఇడ్లీ ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త భిన్నంగా చేయడానికి ప్రయత్నించాలి. మనం ఉపయోగించే ఇడ్లీ రవ్వ అంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. కాబట్టి, సాధారణ ఇడ్లీ రవ్వ కి బదులు మిలెట్స్ రవ్వ ఉపయోగించాలి. దీని వల్ల పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన వాళ్లం అవుతాం. రుచి కూడా బాగుంటుంది. ఈ ఇడ్లీకి ఎక్కువ కూరగాయలతో సాంబార్ ని జత చేస్తే సరిపోతుంది.ఇది తయారు చేయడం కూడా సులభంగా అవుతుంది.
 


Poha

2.పోహ..
సులభంగా తయారు చేయగల మరో బ్రేక్ ఫాస్ట్  పోహ అని చెప్పొచ్చు. ఈ పోహని తయారు చేసే సమయంలో మనం పల్లీలు, కాజు లాంటివి, కొన్ని కూరగాయలు వేసి రుచిగా తయారు చేయవచ్చు. కొంచెం తిన్నా, వారి కడుపు నిండుగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా లభిస్తుంది.

3.ఉప్మా..

ఉప్మాని చాలా మంది చాలా తక్కువగా తీసేస్తారు. కానీ,  గోధుమ రవ్వతో తయారు చేసిన ఉప్మా ఆరోగ్యకరంగా ఉంటుంది. దానిలో క్యారెట్ , బఠానీ వంటి కూరగాయలను ఉపయోగించి ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు.తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోదు.

aloo parata


4.పరాఠా..
పరాఠా చేయాలంటే, మళ్లీ దానికి స్పెషల్ గా కర్రీ చేయాలని, దానికి సమయం ఎక్కువ పడుతుంది అనుకుంటారు. కానీ, ఆ పరాఠాలోనే ఆలు, పనీర్ స్టప్ పెట్టేస్తే చేయడం సులభం. పిల్లల కడుపు కూడా త్వరగా నిండుతుంది. వారికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. కేవలం, ఆలు, పరోటానే కాదు, చాలా రకాలుగా ఈ పరోటా చేయవచ్చు.

pan cake

5.ప్యాన్ కేక్..
నార్మల్ గా మనం పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా పెడుతూ ఉంటాం. అయితే, దానికి బదులు శెనగపిండితో దోశ, లేదంటే ఆమ్లెట్ లేదంటే, ప్యాన్ కేక్స్ ని బ్రేక్ ఫాస్ట్ గా పెట్టొచ్చు. ప్యాన్ కేక్స్ లో మనం ఆరోగ్యకరంగా చేసేందుకు ఫ్రూట్స్ వాడొచ్చు.

6.బ్రెడ్..
సాధారణంగా మిల్క్ బ్రెడ్ అంతగా ఆరోగ్యకరం కాదు. కానీ, మనం వారికి బ్రౌన్ బ్రెడ్ పెట్టొచ్చు. దానిని లైట్ గా టోస్ట్ చేసి దానికి జతగా ఆమ్లెట్ లేదంటే, ఎగ్ బుర్జీ చేసి అందించవచ్చు. పిల్లల కడుపు నిండటంతో పాటు, వారికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. 

Latest Videos

click me!