ఇవి తింటే మీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది తెలుసా..?

First Published | May 11, 2021, 12:28 PM IST

ఆహారంలోని సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, డోపమైన్ వంటి ఇతర న్యూట్రో ట్రాన్స్ ఫార్మర్లు.. మన శరీరంలోని హార్మోన్లను ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

మీరు తినే ఆహారాన్ని బట్టే మీ మెదడు పనిచేస్తుందనే విషయం మీకు తెలుసా..? మీరు చదివింది అక్షరాలా సత్యం. మనం తీసుకునే ఆహారం మీద ఆరోగ్యం మాత్రమే కాదు.. మెదడు పనితీరు కూడా ఆధారపడుతుంది.
undefined
ఆహారంలోని సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, డోపమైన్ వంటి ఇతర న్యూట్రో ట్రాన్స్ ఫార్మర్లు.. మన శరీరంలోని హార్మోన్లను ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
undefined

Latest Videos


ఎలాంటి ఆహారం తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుందనే విషయంపై తాజాగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
నువ్వులు..నువ్వుల్లో అమైనో ఆమ్లం టైరోసిన్ కలిగి ఉంటాయి, ఇది మెదడులో డోపామైన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఆలోచన మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. 100 గ్రాముల నువ్వులు 0.79 గ్రా టైరోసిన్ కలిగి ఉంటాయి.
undefined
కాఫీ..మెదడుకు కాఫీ చాలా మంచిది. ఇది అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి మెదడు వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు కాఫీ తాగడం మెదడుకు మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మెదడు యొక్క సున్నితమైన విధులను నిర్వహిస్తుంది, ముఖ్యంగా వృద్ధులలో మతిమరుపు సమస్యను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది.
undefined
అరటి పండ్లు..అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వాటిలో అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ ఉంటుంది. మీడియం సైజు అరటిలో 11 మిల్లీగ్రాముల ట్రిప్టోఫాన్ ఉంటుంది. పొటాషియం , మెగ్నీషియం ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
undefined
అందుకే.. ప్రతి ఒక్కరూ తమ డైట్ లో ఈ మూడు ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.
undefined
click me!