టైం పాస్ కోసం చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగిస్తున్నారా..? ఏమౌతుందో తెలుసా?

First Published | May 11, 2021, 11:54 AM IST

ఒబేసిటీ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందట. అది మాత్రమే కాదట...  ఎముకలను బలహీనం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చేసిన సర్వేలో తేలింది.

ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ తినడం అలవాటు లేనివారు ఎవరుంటారు చెప్పండి..? ఆకలేసినా.. ఏం తోచకున్నా.. చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ లాంటివి నమిలేస్తుంటారు. అయితే.. తోచడం లేదు కదా అని ఇలాంటి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ఒబేసిటీ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందట. అది మాత్రమే కాదట... ఎముకలను బలహీనం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చేసిన సర్వేలో తేలింది.
undefined

Latest Videos


ఇజ్రాయెల్‌లోని హిబ్రూ యూనివర్శిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకుల బృందం అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు, ఎముక నాణ్యతను తగ్గించడం మధ్య సంబంధాలను నిరూపించింది.ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇవి చాలా హాని కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
undefined
ఈ పరిశోధనను వారు ఎముకలపై చేయడం గమనార్హం. కాగా.. ఆ పరిశోధనలో ఎముకలు వాటి ఎముకల సాంద్రతను కోల్పోయినట్లు గుర్తించారు.
undefined
అంతేకాదు... ఈ ఆహారాలు తీసుకున్న ఎముకలలో పెరుగుదల సమస్యలు కూడా తలెత్తినట్లు గుర్తించారు. ఇవే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ని పిల్లలు తింటే.. వారిలో కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
undefined
పెరుగుదల సమస్యలు రావడం.. బలహీనం అయిపోవడం.. చిన్న వయసులోనే నొప్పులు లాంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
undefined
అయితే.. ఇంట్లో తాయరు చేసుకొని తినడం వల్ల ఎలాంటి హాని ఉండదట. కేవలం మార్కెట్లో లభించే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్లే సమస్య మొదలౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. చిప్స్, ప్రైస్ లాంటి ఫుడ్ కి పిల్లలను దూరంగా ఉంచడమే ఉత్తమం. లేదు అంటే... ఇంట్లోనే తయారు చేసి తినడం ఉత్తమం.
undefined
click me!