belly fat
ఏదేమైనా మీరు బరువు తగ్గడమన్నది ఒక్కరోజులో లేదా వారంలో జరిగే ముచ్చట కాదు. దీనికోసం నెలలు, సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. బరువు తగ్గడమేనది మీరు తినే ఫుడ్, జీవన శైలి, వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది. వీటన్నింటితో పాటుగ బరువు తగ్గడానికి దోహదపడే కొన్ని మసాలా దినుసులు కూడా ఉన్నాయి. అవును మన వంటింట్లో ఖచ్చితంగా ఉండే కొన్ని మసాలా దినుసులు ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మీ పొట్ట, అధిక శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
ఎర్ర మిరపకాయలు
మన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును సులభంగా తగ్గించుకోవాలంటే మన మెటబాలిజం వేగంగా ఉండాలి. అయితే ఎర్ర మిరపకాయలు మన జీవక్రియను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ మిరపకాయలు మన జీవక్రియను వేగవంతం చేస్తాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఒకవేళ మీకు స్పైసీ ఫుడ్ ఇష్టమైతే మీ కూరల్లో ఖచ్చితంగా ఎర్రమిరపకాయ పొడిని చేర్చండి. అయితే మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం దీన్ని తీసుకోకండి.
Fenugreek Water
మెంతులు
బరువు తగ్గడానికి మెంతులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మెంతుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో కరిగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ ఒంట్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. దీంతో మీరు బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుంది.
Cinnamon
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో సహా ఇతర పోషకాలు మీ జీవక్రియ రేటును పెంచడానికి ఉపయోగపడతాయి. ఇది మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
సోంపు
చాలా మంది సోంపును అన్నం తిన్న తర్వాత నోట్లో వేసుకుని నములుతుంటారు. ఎందుకంటే ఇది అన్నం తొందరగా అరిగేలా చేస్తుందని. కానీ సోంపు ఈ పని ఒక్కటే కాదు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అవును సోంపులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది.
Image: Freepik
కలోంజి
బరువు తగ్గడానికి, పొట్టను కరిగించడానికి కూడా కలోంజి ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఫైటోకెమికల్స్ అని పిలువబడే క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.