మురుకుల నుంచి నువ్వుల లడ్డూల వరకు.. ఈ సంక్రాంతికి ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది

First Published Jan 13, 2024, 1:31 PM IST

Makar Sankranti 2024: ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగను జనవరి 15న జరుపుకోబోతున్నాం. ఈ పండుగను భారతదేశం అంతటా వివిధ పేర్లతో పిలుస్తారు. అలాగే వివిధ పద్దతుల్లో జరుపుకుంటారు. ఈ రోజు ఎన్నో రకాల వంటలను కూడా తయారుచేస్తుంటారు. అసలే వంటలు లేకుండా మకర సంక్రాంతి పండుగ సంపూర్ణం కాదు. మరి ఈ పండుగకు టేస్టీ టేస్టీ వంటలను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

murukku

Makar Sankranti 2024: సంక్రాంతి పండుగ వచ్చేసినట్టే. ఈ ఏడాది జనవరి 15న దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ రోజునే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజున గంగా స్నానం, దానం, జపం చేస్తారు. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  వీటితో పాటుగా ఈ రోజు కొన్ని ప్రత్యేక వంటకాలకు కూడా విభిన్న ప్రాముఖ్యత ఉంది. ఈ వంటకాలు లేకుండా ఈ పండుగ సంపూర్ణం కాదు. మరి ఈ సంక్రాంతి పండుగకు వంటలను ఏ పద్దతిలో చేస్తే టేస్టీగా అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నువ్వుల లడ్డూలు

మకర సంక్రాంతి నాడు నువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజు నువ్వుల లడ్డూలు తయారుచేసి ఖచ్చితంగా తింటారు. నిజానికి నువ్వుల లడ్డూలను తయారు చేయడం చాలా ఈజీ. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు వీటిని తయారు చేయడానికి నువ్వులను కడాయిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో బెల్లం వేడి చేసి కరిగించాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత అందులో నువ్వులు వేయండి.  దీన్ని వీలైనంత తొందరగా లడ్డూలను తయారుచేయండి. బెల్లం చల్లబడక ముండే ఈ లడ్డూలను తయారుచేయాలి. లేదంటే లడ్డూ షేప్ రాదు.
 

Latest Videos


బెల్లం పట్టీ

మకర సంక్రాంతికి అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాల్లో బెల్లం పట్టీ కూడా ఉంది. బెల్లం, వేరుశెనగలను చలికాలంలో ఖచ్చితంగా తింటారు. వీటితో చిక్కీ లేదా బెల్లం స్ట్రిప్ తయారుచేస్తారు. ఇది తయారు చేయడానికి ముందుగా వేరుశెనగలను వేయించండి. బాణలిలో బెల్లం కరిగించి అందులో పల్లీలను వేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత వాటిని పట్టీల రూపంలో కట్ చేయండి.
 

బొంగుల లడ్డూలు

మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తర భారతదేశంలో బొంగులతో చేసిన లడ్డూలను తినే ఆచారం ఉంది. ఈ లడ్డూలు తినడానికి చాలా తియ్యగా, క్రంచీగా ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి బెల్లాన్ని కరిగించి అందులో బొంగులను వేయండి. తర్వాత వీటిని లడ్డూల తయారుచేయండి. బెల్లం చల్లబడకముందే ఈ లడ్డూలను తయారుచేయాలి. 
 

పూరన్ పోలి

మహారాష్ట్రలో మకర సంక్రాంతి సందర్భంగా ఈ వంటకాన్ని ఖచ్చితంగా తయారుచేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక రొట్టెలా కనిపిస్తుంది. కానీ దీనిలోని స్వీట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. 
 

కిచిడి

ఉత్తర భారతదేశంలో.. ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో మకర సంక్రాంతి పండుగ కిచిడీ లేకుండా పండుగ సంపూర్ణం కాదు. అందుకే పండుగను ఈ ప్రదేశాలలో కిచిడీ అని కూడా పిలుస్తారు. ఇందులో ఈ సీజన్ కు చెందిన కూరగాయలన్నింటినీ కలిపి నెయ్యితో వడ్డిస్తారు. మసాలా దినుసులు, కూరగాయల రుచి కిచిడీని మరింత టేస్టీగా చేస్తుంది. దీన్ని తయారుచేయడం కూడా చాలా ఈజీ.
 

మురుకులు

దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో.. మకర సంక్రాంతిని పొంగల్ గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మురుకులను ఖచ్చితంగా తయారుచేస్తారు. ఇది చక్లీలా కనిపిస్తుంది. ఇది మినప్పప్పు, బియ్యం పిండితో తయారుచేస్తారు. 
 

మకర్ చౌలా

తాజా బియ్యంతో చేసిన ఈ వంటకానికి మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఖీర్ మాదిరిగానే ఉంటుంది. కానీ అరటిపండు, చెరుకు, పాలు, బెల్లం, బియ్యంతో దీన్ని తయారుచేస్తారు. దీన్ని ప్రసాదంగా తీసుకుంటారు. 

click me!