ladies finger
బెండకాయను కూరగా చేసుకుని తిన్నా.. బెండకాయ వాటర్ తాగినా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. కానీ కొందరికి బెండకాయ సమస్యలను తెచ్చిపెడుతుంది. అవును కొనన్ని అనారోగ్య సమస్యలున్నవారు బెండకాయలను పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా కొన్ని కూరగాయలు కొంతమందిలో అలెర్జీని కలిగిస్తాయి. ఉదాహరణకు.. కొంతమందికి వంకాయ, కాకరకాయ వంటి వాటిని తింటే అలెర్జీ వస్తుంది. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవారు వీటిని తినరు. మరి బెండకాయలను ఎలాంటి సమస్యలున్నవారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణ అలెర్జీ సమస్య ఉన్నవారు బెండకాయను అస్సలు తినకూడదుని నిపుణులు చెబుతున్నారు.
కొందరికి కోకో, మందారం పువ్వు కు అలెర్జీ ఉంటుంది. ఈ రెండు అలర్జీలు ఉన్నవారు కూడా బెండకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ స్టోన్ సంబంధిత సమస్యలున్న వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమస్య ఉన్నవారు బెండకాయ తినకపోవడమే మంచిదట.
అలాగే గ్యాస్ , కడుపు ఉబ్బరం, విరేచనాలు, జీర్ణకోశ సమస్యలున్న వారు కూడా బెండకాయలను పొరపాటున కూడా తినకూడదు. 0
ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు బెండకాయను తక్కువ పరిమాణంలోనే నూనెలో ఉడికించి తినాలని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటీస్ తో బాధపడేవారు కూడా బెండకాయను అతిగా తినకూడదు. వీరు ఈ కూరగాయలను లిమిట్ లోనే తినాలి.
అలాగే రక్తం గడ్డకట్టే సమస్యలున్న వారు, ఇందుకు మందులను వాడే వారు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే బెండకాయలను తినాలి. ఎందుకంటే బెండకాయ రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది.