100 గ్రాముల టమాటాలతో ఇన్ని లాభాలా?

First Published | Sep 3, 2023, 2:27 PM IST

టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె , పొటాషియం, భాస్వరం, ఫైబర్, లైకోపీన్, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. 
 

Image: Getty Images

టమాటాలు పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయ. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల ప్రమాదం నుంచి రక్షిస్తాయి. 
 

100 గ్రాముల టమాటాల్లో ఏముందో తెలుసా? 

కేలరీలు: సుమారు 22 కేలరీలు
కార్బోహైడ్రేట్లు: సుమారు 4.8 గ్రాములు
చక్కెర: సుమారు 3.2 గ్రాములు
ప్రోటీన్: 1.1 గ్రా
కొవ్వు: 0.2 గ్రా
ఫైబర్స్: 1.5 గ్రా
 

Latest Videos


tomatoes

టమాటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

గుండె ఆరోగ్యం

టమాటాలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. టమాటాల్లో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో గుండెను కాపాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

క్యాన్సర్ నివారణ

టమాటాలు విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. మాలిక్యులర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ మోతాదులో బీటా కెరోటిన్ తీసుకోవడంవల్ల  ప్రోస్టేట్ క్యాన్సర్ లో కణితి అభివృద్ధిని నివారించడానికి సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా టమాటాలు ఎంతో సహాయపడతాయి. టమాటాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం, విరేచనాలను నివారించడంలో ఇవి ఎంతో మేలు చేస్తాయి.

అధిక రక్తపోటు

హై బీపీ అని పిలువబడే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా టమాటాలు ఎంతో సహాయపడతాయి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండే టమాటాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉండదు. 
 

డయాబెటీస్

ఒక కప్పు చిన్న టమోటాలో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా టమాటాలు తినొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
 

కంటి ఆరోగ్యం

టమాటాలలో లుటిన్, లైకోపీన్ వంటి ముఖ్యమైన కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టమాటాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

చర్మ, జుట్టు ఆరోగ్యం

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టమాటాలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

click me!