జీడిపప్పు ని వాళ్లు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

First Published Jun 28, 2024, 2:17 PM IST

 మీ మైగ్రేన్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. వీటిలో అమినో యాసిడ్స్ ఉంటాయి.. ఇవి మైగ్రేన్ నొప్పిని పెంచే స్తాయి.

జీడిపప్పును ఎవరైనా సరే ఇష్టంగా  తింటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ లో ఎవరైనా ఇష్టపడేది  జీడిపప్పునే. దీనిని మితంగా తింటే చాలా ఆరోగ్యకరం. కానీ.. ఈ జీడిపప్పును కొందరు పోరపాటున కూడా  తినకూడదట.  ఎవరు జీడిపప్పును తినకూడదో తెలుసుకుందాం....
 

మీలో ఎవరికైనా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. పొరపాటున కూడా జీడిపప్పు తినకూడదు. ఒకటి రెండు తింటే ఏమౌతుందిలే అనుకున్నా మీరు పొరపడినట్లే.. మీ మైగ్రేన్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. వీటిలో అమినో యాసిడ్స్ ఉంటాయి.. ఇవి మైగ్రేన్ నొప్పిని పెంచే స్తాయి.
 

మీరు ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అయ్యి ఉంటే.. పొరపాటున కూడా జీడిపప్పు తినకూడదు.  ఒకవేళ మరీ తినాలని ఉన్నా... చాలా తక్కువ క్వాంటిటీలో తినడం మంచిది. ఎందుకంటే... జీడిపప్పు. మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ని పెంచేస్తాయి.

ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. అందరికీ ఈ సమస్య వస్తోంది. వీళ్లు కూడా.. జీడిపప్పు అస్సలు తినకూడదు. ఎందుకంటే... ఆ కిడ్నీల్లో రాళ్ల సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఇవి మాత్రమే కాదు.. ఎవరైతే అధిక బరువుతో ఉన్నాం అని , బరువు తగ్గాలి అనుకునేవారు కూడా  జీడిపప్పు తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే.. జీడిపప్పు బరువును మళ్లీ పెంచేస్తుంది.
 

ఎవరికైనా హై బీపీ సమస్య ఉంటే.. వాళ్లు కూడా కాజు, జీడిపప్పు తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే.. ఇవి కూడా... బీపీని మరింత పెంచేలా చేస్తాయి. ఇది మీ హెల్త్  కి మంచిది కాదు. 

ఎవరికైనా అలర్జీ సమస్యలు ఉన్నా, ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్నా.. వాళ్లు జీడిపప్పు తినకుండా ఉండటమే మంచిది.  ఎందుకంటే.. అలర్జీ ఉన్నవారు వీటిని తింటే.. చర్మంపై ర్యాషెస్, దురద లాంటివి వస్తాయి. కాబట్టి.. వీటికి దూరంగా ఉండటమే మంచిది.

Latest Videos

click me!