ఇవి తింటే... జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

First Published | Aug 5, 2021, 2:57 PM IST

కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల జుట్టు ఒత్తుగా.. ఆరోగ్యంగా పెరుగుతుందట. అవేంటో ఇప్పుడు  చూద్దాం..
 

జుట్టు అందంగా... ఒత్తుగా పెరగాలని అందరూ కోరుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో కాలుష్యం కారణంగా.. మన లైఫ్ స్టైల్ కారణంగా జుట్టు ఆరోగ్యంగా పెరగడం చాలా కష్టమనే చెప్పాలి. అయితే.. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల జుట్టు ఒత్తుగా.. ఆరోగ్యంగా పెరుగుతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

hair 

1. కోడిగుడ్డు.. కోడిగుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు బలంగా పెరగడానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఎగ్ వైట్ జుట్టు పెరుగుదలకు బాగా సహాయం చేస్తుంది.

2. పాలకూర.. చాలా మందిలో ఐరన్ లోపం కారణంగా జుట్టురాలుతుంది. ఐరన్.. పాలకూరలో పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు.. పాలకూరలో పీచు పదార్థం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు పొడవుగా.. ధ్రుడంగా పెరగడానికి సహాయం చేస్తాయి.
3. క్యారెట్.. క్యారెట్ కూడా వెంట్రుకలను ధ్రుడంగా చేయడానికి సహాయం చేస్తుంది. వీటిలో విటమిన్ బీ7 పుష్కలంగా లభిస్తుంది. దీన్ని బయోటిన్ అని పిలుస్తారు. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీనిని అప్పుడప్పుడూ తింటూ ఉండాలి. క్యారెట్ హెయిర్ మాస్క్ కూడా ప్రయత్నించవచ్చు.

carrot

4.ఉల్లిపాయ.. మనం దాదాపు ఉల్లిపాయ లేకుండా ఏ కూర చేయం. భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇదే ఉల్లిపాయ లో జింక్, ఐరన్, బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. దీనిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉల్లిరసాన్ని డైరెక్ట్ గా జుట్టుకు కూడా పట్టించవచ్చు.
5.చిలగడదుదంప.. దీనిలో బీటా కెరోటిన్ అధిక మొత్తంలో ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకున్న తర్వాత.. అది విటమిన్ ఏ గా మారుతుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల జుట్టు బలంగా పెరగడానికి సహాయం చేస్తుంది.
6.ఇవి మాత్రమే కాకుండా.. టమాటలు, బీట్ రూట్ లు కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయం చేస్తాయి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు బలాన్ని అందిస్తాయి. టమాట జుట్టుని హెయిర్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు.

beetroot

Latest Videos

click me!