భారతీయులంతా పెరుగు లేకుండా.. భోజనం పూర్తి చేయరు. ఈ పెరుగును ఎండాకాలంలో తీసుకోవడం వల్ల... శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. అంతేకాదు.. శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. భోజనం తర్వగా అరగడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు.. ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. వారు కనుక ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని సులభంగా తగ్గించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
curd
పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో బీఎంఐ ని అదుపులో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అధిక బరువు తగ్గించడానికి పెరుగు ఎంతగానో సహాయం చేస్తుంది.
బరువు తగ్గాలని అనుకునేవారు.. ముందు భోజనం తినడం మానేస్తారు. అలా కాకుండా.. కనీసం శరీరానికి కావల్సిన ప్రోటీన్లు తీసుకోవాలి. పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. పెరుగులో కార్బ్ తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు మాత్రం ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొట్ట వద్ద ఉన్న కొవ్వు తగ్గించడానికి సహాయం చేస్తుంది.
పెరుగు జీవక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్.. జీవక్రియను మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా శరీరానికి అందాల్సిన పోషకాలు అందేలా సహాయం చేస్తుంది.
మరి ఈ పెరుగును రోజూ ఆహారంలో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. భోజనం చేసేటప్పుడు ఒక కప్పు పెరుగుతినొచ్చు. అల్పాహారంలో పెరుగును స్మూతీలా చేసుకొని తాగొచ్చు.
లేదంటే పండ్లు, కూరగాయలతో కలిసి రైతాలాగా చేసుకోవచ్చు. చాలా మంది పెరుగులో పంచదార కలిపి తీసుకుంటారు. దాని వల్ల శరీరంలో అదనపు కేలరీలు చేరతాయి. కాబట్టి.. అలా కాకుండా.. పంచదారకి బదులు బెల్లం, మసలా వేసుకొని తినొచ్చు.