ఆహారం తీసుకోకుండా అయినా.. కొన్ని రోజులపాటు బతకగలమేమో కానీ.. గాలి పీల్చకుండా.. నీరు తాగకుండా బతకలేం. ఈ భూమి మీద ఉన్న ప్రాణులందరికీ.. మంచినీరు చాలా అవసరం. అయితే.. మంచినీరు తీసుకోవడం ఎంత అవసరమో.. దానికి ఎలా తీసుకుంటున్నామనే విషయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
అసలు మనం తీసుకునే మంచినీరు మనకు ఆరోగ్యాన్ని అందిస్తుందా..? ఆయుర్వేదం ప్రకారం.. మంచినీరు ఎలా తీసుకోవాలి..? ఎలా తీసుకుంటే.. మనకు మరింత ఆరోగ్యం చేకూరుతుంది. మంచి నీటినిలో ఎందులో స్టోర్ చేయాలి..? ఇలాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
water can
ఇప్పుడంటే.. ఫ్రిడ్జ్ లు వచ్చాయి కదా... అని చల్లగా ఉండటానికి అందులో నీటిని నిల్వ చేస్తున్నాం. ఇక నీరు స్వచ్ఛత కోసం ప్యూరిఫయ్యర్స్ వాడుతున్నాం. కానీ.. ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో.. ఇవేమీ లేవు. కాబట్టి.. వారు మట్టి కుండలనే వాడేవారు.
things-in-fridge
నిజానికి మట్టి కుండల్లో మంచినీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదట. కుండలో నీటి.. స్వచ్ఛంగా మారుస్తుందట. అంతేకాకుండా.. నీరు చల్లగా ఉండేలా సహాయం చేస్తుంది. మట్టి కుండలో నీరు తాగడం వల్ల... మన శరీరంలోని పీహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి సహాయం చేస్తుందట. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రాకుండా కూడా సహాయం చేస్తుంది.
Soil pot water
ఇక.. చాలా మంది మంచి నీటిని ప్లాస్టిక్ బాటిల్స్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ.. దాని వల్ల ప్రయోజనాలకన్నా.. దుష్ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
water bottle
మట్టి కుండలు వాడే వెసులుబాటు లేనివారు.. కనీసం రాగి( కాపర్) బిందెలు, రాగి వాటర్ బాటిల్స్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ మధ్య వైద్యులు సైతం కాపర్ బాటిల్స్ ఉపయోగించమని సూచిస్తున్నారు.
copper water bottle
ముఖ్యంగా.. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు.. ఈ కాపర్ బాటిల్స్ ఉపయోగించడం చాలా అవసరమని చెబుతున్నారు.
copper mug
శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలోనూ ఈ కాపర్ పాత్రలు సహాయం చేస్తాయి. కాబట్టి.. మంచి నీరు తాగడానికి కాపర్ వస్తువులు ఉపయోగించమని నిపుణులు సూచిస్తున్నారు.
Copper mug
ఇక చాలా మందికి మంచినీరు.. బాగా వేడివి తాగడం మంచిదా లేక.. చల్లని నీరు తాగడం మంచిదా అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..
copper
రూమ్ టెంపరేచర్ ని బట్టి మంచినీరు తీసుకోవాలట. 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ లో ఉన్న మంచినీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.