ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ ఏదీ ఉండదేమో. ప్రతి ఒక్కరికీ ఫ్రిడ్జ్ అనేది ఓ నిత్యవసర వస్తువుగా మారింది. మార్కెట్లో కొన్న ప్రతి వస్తువును అందరూ.. ముందుగా అమర్చేది ఫ్రిడ్జ్ లోనే. కూరగాయాలు, పండ్లు.. పాలు, పెరుగు దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువును మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాం. అలా ఎందుకు పెడుతున్నాము అంటే.. సదరు ఆహార పదార్థం త్వరగా పాడవ్వకూడదని.. ఎక్కువ కాలం నిల్వ ఉండాలని మనం అలా చేస్తూ ఉంటాం. అయితే.. ప్రతి వస్తువును ఫ్రిడ్జ్ లో పెట్టకూడదట. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలు కోల్పోవడమే కాకుండా రుచిలోనూ తేడా వస్తుందట. పోషకాలు పోయిన తర్వాత.. ఆ ఆహారాలు తిన్నా మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు కదా. మరి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని ఆహార పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం...
1.పచ్చి మామిడి పండ్లు..
పచ్చి మామిడి పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే.. ఆ చల్లదనం వల్ల పండు పండే ప్రక్రియను తగ్గిస్తుంది. ఇది మామిడిని ఆకృతిలో గట్టిగా చేస్తుంది. వాస్తవానికి, పండిన మామిడి పండ్లను మాత్రమే నిల్వ చేయడం మంచిది, ఎందుకంటే ఇది వాటిని గట్టిగా, తీపి , తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
2.వంట నూనె..
ఇక చాలా మంది నూనెలను కూడా ఫ్రిడ్జ్ లో ఉంచుతూ ఉంటారు. నిజానికి ఫ్రిడ్జ్ లో నూనెలు ఉంచకూడదు. ఫ్రిజ్‌లో నూనెను ఉంచడం వల్ల దాని ఆకృతి,రంగు మారుతుంది. దాని రుచి పై కూడా ప్రభావం చూపిస్తుంది.
3.వండిన చికెన్
ఉడికించిన చికెన్‌ను రెండు మూడు రోజులకు మించి ఫ్రిజ్‌లో ఉంచితే అది పాడైపోతుంది. రుచి మారడమే కాకుండా, చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వల్ల ఆకృతితో పాటు రుచి కూడా పాడవుతుంది. రిఫ్రిజిరేటెడ్ వండిన చికెన్ తినడం ఫుడ్ పాయిజనింగ్, అనేక ఇతర జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
4.తేనె
తేనెను ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి తేనె ఎక్కువ కాలం పాడవ్వకుండా ఉంటుంది. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద తేనె చెడిపోదు. అయితే, రిఫ్రిజిరేటర్ లోపల తేనెను నిల్వ చేయడం వలన అది గడ్డలాగా మారుతుంది. ఆ తర్వాత దానిని వాడలాంటే మనం తిప్పలు పడాల్సిందే.
5.హెర్బ్స్..
పుదీనా, కొత్తిమీర వంటి తాజా హెర్బ్స్ ని ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు, ఎందుకంటే ఆకులు వాడిపోతాయి. ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు వాటిలోని అధిక తేమ ఆవిరైపోతుంది. తద్వారా అవి తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. ఆకులను శుభ్రం చేసుకున్న తర్వాత.. ఏదైనా కాగితంలో పెట్టినా అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.