థైరాయిడ్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి

First Published | Jul 16, 2023, 1:04 PM IST

హైపోథైరాయిడిజం.. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. హైపర్ థైరాయిడిజం..  థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

థైరాయిడ్ అనేది మన మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది శరీర పెరుగుదలలో, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి రుగ్మతల కారణంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా పెరగడం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కరివేపాకు

కరివేపాకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది కరివేపాకులను తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. వీటిలో కాపర్ పుష్కలంగా ఉంటుండి. ఇది థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. 
 


curd

పెరుగు

పెరుగు మంచి పోషకాల బాంఢాగారం. అయోడిన్ పుష్కలంగా ఉండే పెరుగు థైరాయిడ్ ఆరోగ్యానికే కాదు పొట్ట ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

దానిమ్మ పండ్లు

దానిమ్మ పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండ్లు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు దానిమ్మ పండ్లు మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. 

ఉసిరికాయ

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను థైరాయిడ్ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఇది వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే అంటువ్యాధులు, ఇతర రోగాల ముప్పును తగ్గిస్తుంది. 

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ విత్తనాలు జింక్ కు గొప్ప మూలం. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాల శోషణకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణ, సమతుల్యతకు దోహదం చేస్తుంది. అందుకే గుమ్మడి గింజలను థైరాయిడ్ రోగులు తప్పకుండా తినాలి. 

Pulses

పప్పు దినుసులు

ప్రోటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉండే పప్పు దినుసులు మీ జీవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి మీరు త్వరగా బరువు పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. థైరాయిడ్ రోగులు వీటిని తింటే హెల్తీగా, స్లిమ్ గా ఉంటారు. 

Image: Freepik

ఖర్జూరాలు

ఖర్జూరాల్లో అయోడిన్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. హార్లోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ఖర్జూరాలు కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతాయి.

Image: Getty Images

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే హైపర్ థైరాయిడిజం ఉన్నవారు కొబ్బరి నూనెను తమ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి.
 

గ్రీన్ టీ 

థైరాయిడ్ రోగులకు  గ్రీన్ టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీరు బరువు పెరగకుండా కాపాడుతుంది. 

Latest Videos

click me!