ఈ మసాలా కాంబినేషన్లు చాలా డేంజర్..!

First Published | Dec 25, 2024, 11:29 AM IST

మసాలా దినసులు ఎంత మంచివి అయినా కొన్ని కాంబినేషన్లు మాత్రం తినకూడదు. ఏయే మసాలా దినుసులు కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం…

మన కిచెన్ లో చాలా రకాల మసాలా దినుసులు ఉంటాయి. వాటిని మనం  రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తూ ఉంటాం. అవి మన వంటకు రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ సహాయపడతాయి. మసాలా దినసులు ఎంత మంచివి అయినా కొన్ని కాంబినేషన్లు మాత్రం తినకూడదు. ఏయే మసాలా దినుసులు కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం…
 

1.పసుపు–మిరియాలు…

పసుపు, మిరియాలు ఈ రెండింటినీ పొరపాటున కూడా కలిపి తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ, రెండు కలిపి తీసుకుంటే మన శరీరం అధిక వేడికి గురయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం పసుపు, మిరియాలు కలిపి తీసుకోకూడదు.
 


cinnamon

2.దాల్చిన చెక్క, లవంగం…

దాల్చిన చెక్క, లవంగం ఈ రెండింటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. కానీ.. ఈ రెండూ కలిపి మాత్రం తీసుకోకూడదు. ఈ రెండూ కలిపి తీసుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
 

3. జాజికాయ. పసుపు ఖాళీ కడుపుతో జాజికాయ, పసుపు కలిపి తీసుకోకూడదు. కడుపులో ఎసిడిటీ పెరిగిి.. జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపులో వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి. 

ఈ మసాలా దినసులను ఎలా వాడాలి..?

పసుపును ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు జాజికాయను తీసుకోవచ్చు. లవంగం, దాల్చిన చెక్కలను మాత్రం చాలా మితంగా తీసుకోవాలట.
 

Latest Videos

click me!