వారానికి 2 సార్లు రెడ్ రైస్ ను తిన్నా చాలు.. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం

First Published | Dec 24, 2024, 2:41 PM IST

వైట్ రైస్ కంటే రెడ్ రైసే మన ఆరోగ్యానికి మంచిదని వినే ఉంటారు. అయితే రోజూ వీలు కాకపోయినా వారానికి రెండు సార్లు రెడ్ రైస్ ను తిన్నా ఎన్నో అనారోగ్య సమస్యలు ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

వైట్ రైస్ నే ప్రతి ఒక్కరూ తింటారు. ఏవో కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రమే రెడ్ రైస్ ను తింటారు. చాలా మంది రెడ్ రైస్ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే తినాలని అనుకుంటారు. కానీ దీన్ని ప్రతి  ఒక్కరూ తినొచ్చు. ఎందుకంటే ఈ రైస్ మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

నిజం చెప్పాలంటే వైట్ రైస్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఉండవు. అలాగే కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ వైట్ రైస్ ను తింటే బరువు పెరగడంతో పాటుగా బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అందుకే వైట్ రైస్ ను ఎక్కువగా తినకూడదని చెప్తారు. 
 

వైట్ రైస్ కంటే రెడ్ రైస్ లోనే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి కొంచెం ఖరీదైనవి కాబట్టి వీటిని ఎవరూ కొని తినరు. రోజూ కాకపోయినా వారానికి రెండు సార్లు తిన్నా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ బియ్యం టేస్టీగా ఉండటమే కాకుండా.. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే వారానికి రెండు సార్లైనా రెడ్ రైస్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 



జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మీరు గనుక వారానికి రెండు సార్లు రెడ్ రైస్ ను తింటే మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రైస్ చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే ఇది మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ రెడ్ రైస్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పేగు కదలికలను నియంత్రిస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వారానికి రెండు సార్లు రెడ్ రైస్ ను తింటే జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

పోషకాలు ఎక్కువగా ఉంటాయి

రెడ్ రైస్ పోషకాలకు మంచి వనరు. దీనిలో మన మొత్తం శరీరానని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

రెడ్ రైస్ లో కాల్షియం, ఇనుము, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, అంటు వ్యాధులతో మన శరీరం పోరాడే సామర్థ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. రోజూ మీరు రెడ్ రైస్ ను తింటే మీ శరీరం బలంగా, హెల్తీగా ఉంటుంది. 

బరువును తగ్గిస్తుంది

బరువు తగ్గాలనుకునేవారు లేదా బరువును అలాగే మెయింటైన్ చేయాలనుకున్న వారు రెడ్ రైస్ ను తినడం మంచిది. ఎందుకంటే దీనిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

దీన్ని తింటే కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది. అతిగా ఆకలి కాదు. అలాగే రోజులో అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉంటారు. రోజూ కాకపోయినా వారానికి రెండు సార్లు మీరు రెడ్ రైస్ ను తింటే బరువు తగ్గుతారు. రోజూ తింటే మరిన్ని ఫలితాలను పొందుతారు.
 

Red Rice

గుండె ఆరోగ్యం

రెడ్ రైస్ లో సోడియం, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. రెడ్ రైస్ రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది. రెడ్ రైస్ లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే వారానికి రెండు సార్లు రెడ్ రైస్ ను తినడం వల్ల మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

శక్తి పెరుగుతుంది

బలహీనంగా లేదా అలసట ఎక్కువగా ఉన్నవారికి రెడ్ రైస్ చాలా మంచిది. మీరు రోజూ లేదా వారానికి రెండు సార్లు రెడ్ రైస్ ను తింటే మీ ఒంట్లో శక్తి పెరుగుతుంది. అలసట, బలహీనత తగ్గుతాయి. రెడ్ రైస్ లో ఎనర్జీని పెంచే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. 

Latest Videos

click me!