ఫ్యాట్ లేని టేస్టీ ఫుడ్స్.. డైట్ లోనూ లాగించేయవచ్చు..!

First Published | Jul 23, 2021, 12:18 PM IST

 డైట్ లో కొన్ని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ ని ఆనందంగా లాగించేయవచ్చట. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..
 

డైటింగ్ లో ఉన్నవారు.. చాలా వరకు నోరు కట్టేసుకుంటారు. ఏది తింటే.. మళ్లీ డైట్ ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని కంగారుపడుతుంటారు. అయితే.. అలాంటివారైనా సరే.. డైట్ లో కొన్ని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ ని ఆనందంగా లాగించేయవచ్చట. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..

డైటింగ్ లో ఉన్నవారు.. చాలా వరకు నోరు కట్టేసుకుంటారు. ఏది తింటే.. మళ్లీ డైట్ ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని కంగారుపడుతుంటారు. అయితే.. అలాంటివారైనా సరే.. డైట్ లో కొన్ని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ ని ఆనందంగా లాగించేయవచ్చట. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..
 

1.పన్నీర్ టిక్కా.. తందూరీ పన్నీర్ టిక్కా, మలాయ్ పన్నీర్ టిక్కా, మసాలా పన్నీర్ టిక్కా.. ఇలా టిక్కాలో చాలా వెరైటీలు ఉన్నాయి. అయితే.. వీటిని ఎలాంటి అనుమానాలు లేకుండా హాయిగా తినేయవచ్చు. వీటిలో ఆయిల్ తక్కువగా ఉంటుంది. గ్రిల్ చేస్తారు కాబట్టి.. ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డైట్ లో కూడా వీటిని తినేయవచ్చు.

1.పన్నీర్ టిక్కా..
తందూరీ పన్నీర్ టిక్కా, మలాయ్ పన్నీర్ టిక్కా, మసాలా పన్నీర్ టిక్కా.. ఇలా టిక్కాలో చాలా వెరైటీలు  ఉన్నాయి. అయితే.. వీటిని  ఎలాంటి అనుమానాలు లేకుండా హాయిగా తినేయవచ్చు. వీటిలో ఆయిల్ తక్కువగా ఉంటుంది. గ్రిల్ చేస్తారు కాబట్టి.. ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డైట్ లో కూడా వీటిని తినేయవచ్చు.


2.మూంగ్లెట్.. దీనినే కట్ లెట్ అని కూడా పిలుస్తారు. దీనిని మూంగ్ దాల్( పెసర పప్పు) తో తయారు చేస్తారు. నానపెట్టిన పెసరపప్పును రుబ్బి.. అందులో ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ వంటి కూరగాయలతో కలిపి.. కొద్దిగా నూనెతో రెండు వైపులా కాలుస్తారు. కాబట్టి..దీనిని తినడం వల్ల ఆరోగ్యమే కానీ.. కొవ్వు ఉండదు.

2.మూంగ్లెట్..

దీనినే కట్ లెట్ అని కూడా పిలుస్తారు. దీనిని మూంగ్ దాల్( పెసర పప్పు) తో తయారు చేస్తారు. నానపెట్టిన పెసరపప్పును రుబ్బి.. అందులో  ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ వంటి కూరగాయలతో కలిపి.. కొద్దిగా నూనెతో రెండు వైపులా కాలుస్తారు. కాబట్టి..దీనిని తినడం వల్ల ఆరోగ్యమే కానీ.. కొవ్వు ఉండదు.
 

3.భేల్ పూరీ.. భేల్ పూరీ.. మహారాష్ట్ర లో దొరికే బెస్ట్ స్నాక్. ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా దొరుకుతోంది. అటుకులు, టమాట తో తయారు చేసే ఈ స్నాక్ చాలా రుచిగా ఉంటుంది. ముంబయిలో ప్రతి బీచ్ దగ్గర ఇది లభిస్తుంది.

3.భేల్ పూరీ..
భేల్ పూరీ.. మహారాష్ట్ర లో దొరికే బెస్ట్ స్నాక్. ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా దొరుకుతోంది. అటుకులు, టమాట తో తయారు చేసే ఈ స్నాక్ చాలా రుచిగా ఉంటుంది. ముంబయిలో ప్రతి బీచ్ దగ్గర ఇది లభిస్తుంది.

4.చాట్.. షికరఖండిచాట్ లేదా.. స్వీట్ పొటాటో చాట్.. ఉత్తర భారతీయులకు ఎంతో నచ్చే స్నాక్ ఇది. దీనిని స్వీట్ పొటాటాతో తయారు చేస్తారు. ఇది కూడా చాలా హెల్దీ స్నాక్. దీనిని కూడా డైట్ లో ఉన్నవారు తినొచ్చు.

4.చాట్..
షికరఖండిచాట్ లేదా.. స్వీట్ పొటాటో చాట్.. ఉత్తర భారతీయులకు ఎంతో నచ్చే స్నాక్ ఇది. దీనిని స్వీట్ పొటాటాతో తయారు చేస్తారు. ఇది కూడా చాలా హెల్దీ స్నాక్. దీనిని కూడా డైట్ లో ఉన్నవారు తినొచ్చు.

5.మసాలా కార్న్.. ఉడకపెట్టిన మొక్క జొన్న గింజెలతో దీనిని తయారు చేస్తారు. దీనిలో నూనె వేయరు.. ఫ్యాట్ కూడా ఉండదు. ఉడకపెట్టిన గింజల్లో కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మకాయ రసం కలిసి తింటారు. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కలిపి కూడా తీసుకోవచ్చు. దీనిలో ఫ్యాట్ ఉండదు. ప్రశాంతంగా డైట్ లోనూ తినేయవచ్చు.

5.మసాలా కార్న్..

ఉడకపెట్టిన మొక్క జొన్న గింజెలతో దీనిని తయారు చేస్తారు. దీనిలో నూనె వేయరు.. ఫ్యాట్ కూడా  ఉండదు. ఉడకపెట్టిన గింజల్లో కొద్దిగా ఉప్పు, కారం,  నిమ్మకాయ రసం కలిసి తింటారు. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కలిపి కూడా తీసుకోవచ్చు. దీనిలో ఫ్యాట్ ఉండదు. ప్రశాంతంగా డైట్ లోనూ తినేయవచ్చు. 

Latest Videos

click me!