బ్రకోలి తింటే.. ఆరోగ్యం మీ వెంటే..!

First Published | Oct 1, 2021, 11:51 AM IST

బ్రకోలీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రకోలీలో విటమిన్ సి, జింక్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం , విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఈ బ్రకోలీని మనం చాలా రకాలు గా తీసుకోవచ్చు. సలాడ్స్, సూప్స్ లో కూడా తీసుకోవచ్చు.

బ్రకోలీ గురించి కొంతకాలం క్రితం మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్స్ ల్లో దొరకటం వలన  అందరికీ  తెలుస్తోంది. చూడటానికి క్యాలిప్లవర్ లా ఉండే.. బ్రకోలి తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వారంలో రెండు సార్లు బ్రకోలీని ఆహారంలో భాగంగా చేసుకుంటే సరిపోతుంది. బ్రకోలీ విటమిన్ సి, జింక్, కాపర్, బి విటమిన్లు, ప్రోటీన్, ఆకుపచ్చని కూరల్లో వుండే సల్ఫోరాఫెన్ అనే ఫైటోకెమికల్ దీనిలో చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నుండి మలినాలను బయటకు పంపుతుంది.


broccoli

బ్రకోలీ వుండే ఇండోల్ – 3 కార్బినోల్, కాంఫ్ఫెరాల్ వంటి సమ్మేళనాలు మంట, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన డయాబెటిస్ వున్నవారికి కూడా చాలా మంచిది. దీనిలో వుండే క్వెరెసిటిన్ వంటి యాంటీ ఆక్సీ డెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ, గుండె సంబంధ అనారోగ్యాలను దూరం చేస్తాయి. బ్రకోలీ సరిగ్గా శుభ్రం చేసిన తరువాతే వంటల్లో వాడాలని బాగా ఉడికించి మాత్రమే వంటల్లో వాడాలని నిపుణులు చెప్పుతున్నారు. దీనిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

బ్రకోలీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రకోలీలో విటమిన్ సి, జింక్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం , విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఈ బ్రకోలీని మనం చాలా రకాలు గా తీసుకోవచ్చు. సలాడ్స్, సూప్స్ లో కూడా తీసుకోవచ్చు.

బ్రకోలీ తో క్యాన్సర్ ని కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  బ్రకోలీ క్యాన్సర్ కణాల వేగవంతమైన పెరుగుదలను తగ్గిస్తుందని,తద్వారా క్యాన్సర్ పెరుగుదల పెరుగుదలను నిరోధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

బ్రకోలీలో పొటాషియం అధికంగా ఉంటుంది. బ్రకోలీలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్ , పొటాషియం వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

broccoli

బ్రకోలీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. బ్రకోలీ షుగర్ పేషెంట్స్ హాయిగా తినేయవచ్చు. ఇది రక్తంలోని  చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

బ్రకోలీ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో పోరాడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కొంత వరకు నియంత్రించడంలో సహాయపడుతుంది.

Latest Videos

click me!