మంచివని ఆపిల్ పండ్లను మరీ ఎక్కువగా తినకండి.. ఎందుకంటే?

First Published | Jan 25, 2024, 11:37 AM IST

రోజుకో ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు దూరంగా ఉంటారన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అందుకే ఈ పండ్లను చాలా మంది రోజూ తింటుంటారు. ఆపిల్ పండ్లను తింటే ఆరోగ్యంగా ఉంటారనేది వాస్తవమే కానీ.. మరీ ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. 
 

Image: Getty Images

పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అందులో ఆపిల్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నిజానికి రోజుకో ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ పండ్లు మనల్ని ఎన్నో రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి. అయితే చాలా మందికి ఆపిల్ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రమే తెలుసు. దాని వల్ల కలిగే నష్టాలు మాత్రం చాలా మందికి తెలియవు. అవును పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు మనకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఆపిల్ పండ్లలో పొటాషియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ.. వీటిని అతిగా తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అసలు ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటే ఏం అవుతుందో తెలుసుకుందాం పదండి.
 

Image: Getty Images

ఆపిల్ పండ్లు దుష్ప్రభావాలు

ఆపిల్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మనకు ఔషదం లాగే పనిచేస్తుంది. అయినప్పటికీ.. ఇది వీటిని ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 


Image: Getty Images

జీర్ణక్రియకు హానికరం

ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే అతిగా తింటే గ్యాస్ సమస్య వస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ శరీరానికి రోజుకు 20-40 గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరం. ఈ మొత్తం వయస్సును బట్టి కొంచెం ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు. కానీ రోజుకు 70 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ ను తీసుకుంటే కడుపు సమస్యలు వస్తాయి. 

Image: Getty Images

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగొచ్చు

యాపిల్స్ లో పొటాషియం, ఫైబర్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే దీన్ని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కా

అలెర్జీ సమస్యలు

ఒక అధ్యయనం ప్రకారం.. పురుగుమందులు ఆపిల్స్ లో కూడా కనిపిస్తాయి. దీనిలో డిఫెనిలామైన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. దీనిని యూరోపియన్ యూనియన్ కూడా నిషేధించింది. ఆపిల్స్ ను ఎక్కువగా తినడం వల్ల అలెర్జీ వస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకండి. 
 

బరువు పెరగడం

మీకు ఆపిల్స్ ఎంత ఇష్టమైనా వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల మీ బరువు ప్రభావితం అవుతుంది. ఆపిల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు బరువు పెరుగుతారు. ఒక చిన్న ఆపిల్ లో 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు,5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.  దీంతో మీరు అతిగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల మీ శరీరం ఎక్కువ కొవ్వును కరిగించలేకపోతుంది. 
 

దంత ఆరోగ్యానికి హానికరం

సోడా కంటే ఆపిల్స్ ఎక్కువ ఆమ్లంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే దంత సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీ దంతాలు దెబ్బతింటాయి. ఇది మీ దంత ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
 

రోజుకు ఎన్ని ఆపిల్స్ ను తినాలి? 

రోజుకు రెండు సాధారణ సైజు యాపిల్స్ తినడం పూర్తిగా సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. మీరు ఇంతకంటే ఎక్కువ ఆపిల్స్ ను తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

Latest Videos

click me!