పసుపు
పసుపు ఎన్నో ఔషధ గుణాలున్న పదార్థం. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందుకోసం పసుపును టీ, సూప్, పులుసు, డిటాక్స్ వాటర్ రూపంలో తీసుకోవచ్చు. పసుపు మన మూత్రపిండాలను శుభ్రపరచడానికి, విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి.