కోడిగుడ్డుతో హల్వా.. ఎప్పుడైనా రుచి చూశారా..?

First Published | Jul 21, 2021, 2:49 PM IST

ఇప్పటి వరకు మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం. ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎగ్ హల్వా రుచి చూశారా..? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు  చూద్దాం..

కోడిగుడ్డు చాలా మంచి ఆహారం. కోడిగుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. రోజులో ఏదో ఒక టైమ్ లోని కచ్చితంగా గుడ్డు తినడం మంచి అలవాటు.
కోడిగుడ్డులో ప్రోటీన్సలు, ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ6, బీ12, ఫాస్పరస్, సెలేనియం లాంటి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. కాబట్టి దీనిని ఏదో ఒక రూపంలో రోజూ తీసుకుంటూ ఉండాలి.

ఇప్పటి వరకు మనం కోడిగుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం. ఆమ్లెట్, ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా ఇలా చాలా రుచి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎగ్ హల్వా రుచి చూశారా..? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం..
ఎగ్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు..1కప్పు పాలు, 200గ్రాముల కోవా, 6 కోడిగుడ్లు, అరకప్పు పంచదార, కొద్దిగా కుంకుమ పువ్వు, 1స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ యాలకుల పొడి, అరకప్పు జీడిపప్పు, పావు కప్పు కిస్ మిస్, చిటికెడ్ నట్ మగ్, ఒక స్పూన్ బాదం పప్పు
తయారీ విధానం. ..ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ లో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలు మరిగిన తర్వాత అందులో కోవా వేసి బాగా కలపాలి. 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యే వరకు కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లపరచాలి.
మరో పెద్ద గిన్నెలో కోడిగుడ్లు పగలకొట్టి వేసి.. దానిలో పంచదార వేసి బాగాకలపాలి. ఆ తర్వాత దీనిలో కుంకుమ పువ్వు వేసి.. ఆ తర్వాత చల్లార్చిన పాలు, కోవా మిశ్రమాన్ని కూడా వేసి బాగాకలపాలి.
తర్వాత మరో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో.. నెయ్యి వేసి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి.. సిమ్ లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం గట్టిపడేంత వరకు కలపాలి.
ఇప్పుడు దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఓ ప్లేట్ పై నెయ్యి రాసి.. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఉంచాలి. దానిపైన బాదం, నట్ మగ్ మిశ్రమంతో గార్నిష్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన షేప్ లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే.. టేస్టీ ఎగ్ హల్వా రెడీ అయిపోయినట్లే..!

Latest Videos

click me!