ఆవలింతలు ఆపేలా..
చాలామంది ఆఫీసుకు వెళ్ళి పని మొదలు పెట్టిన కాసేపటికే ఆవలింతలు వస్తాయి. ఎంత పని చేద్దామన్నా నిద్ర వస్తూనే ఉంటుంది. దీనివల్ల సరిగ్గా పని చేయలేకపోతారు.
ఒకే రకమైన ఆహారాన్ని మళ్లీ మళ్లీ తినకండి. చాలామంది ఉదయం టిఫిన్‌కి తిన్న ఆహారాన్నే మధ్యాహ్నం లంచ్‌కి కూడా తెచ్చుకుంటారు. ఇలా చేస్తే నిద్రొస్తుంది.
అన్నం తింటే నిద్రొస్తుంది. జీర్ణక్రియ సమయంలో, బియ్యంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారతాయి, ఇది నిద్రను ప్రోత్సహించే హార్మోన్లను పెంచుతుంది. పొద్దున, మధ్యాహ్నం సాధ్యమైనంత తక్కువగా అన్నం తినాలి. వాటికి ప్రత్యామ్నాయం చూసుకోవాలి.
ఓట్స్, బియ్యం, టొమాటోలు, పుట్టగొడుగులు, పిస్తా, గుడ్లలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే నిద్ర ముంచుకువచ్చే అవకాశం ఉంది. వీటిని మధ్యాహ్నం తక్కువగా తినాలి.
ఎక్కువ ప్రోటీన్ ఆహారాలు తింటే అలసటగా అనిపించవచ్చు. పాలు, పాలకూర, గింజలు, సోయా ఉత్పత్తులు, చికెన్ తినకుండా ఉండటం మంచిది. చక్కెర ఆహారాలు కూడా మీకు మత్తును కలిగిస్తాయి. చక్కెర శక్తిని ఇచ్చినప్పటికీ, అతిగా తినడం హానికరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.