స్పైసీ మీట్ బాల్స్..ముట్టీలుగా కూడా పిలిచే మాంసం ఉండలు చూడగానే నోట్లో నీళ్లురతాయి. స్నాక్ ఐటమ్ గా, సాంబార్ కు తోడుగా.. మందుకు మంచింగ్ గా ఈ ముట్టీలు భలే ఉంటాయి.
వీటిని కాస్త సూప్ ఉండేలా చేస్తే మెయిన్ డిష్ గా కూడా తింటారు. ఈ మీట్ బాల్స్ మరో ఉపయోగం ఏంటంటే.. ఒక్కచుక్కా నీరు లేకుండా పూర్తిగా నూనెలో తయారవుతాయి కాబట్టి రెండుమూడు రోజుల వరకు ఫ్రెష్ గా కూడా ఉంటాయి.
దీన్ని అన్నంతో పాటు తినొచ్చు లేదా పిటా బ్రెడ్, సల్సా, సలాడ్‌తో తినచ్చు. మీ ఇంటికి వచ్చిన అతిథులకు ఈ టేస్టీ మీట్ బాల్స్ తో సర్ ఫ్రైజ్ చేయచ్చు. కాక్‌టెయిల్స్ లేదా మాక్‌టెయిల్స్‌తో ఈ మీట్‌బాల్‌ల్స్ ను సర్వ చేస్తే సూపర్ గా ఉంటాయి.
స్పైసీ మీట్‌బాల్స్ లేదా ముట్టీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..200 గ్రాముల మాంసం సన్నగా ఖీమా కొట్టించాలిఉల్లిపాయలువెల్లుల్లికరివేపాకుజీలకర్రగరం మసాలా పొడికారం పొడికొత్తిమీరకోడిగుడ్డుబ్రెడ్ క్రంబ్స్నూనెఉప్పు రుచికి తగినంత
తయారీ విధానం..ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, గరం మసాలా, కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసాక.. ఖీమా కొట్టించిన మాంసాన్ని వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో గుడ్లు, బ్రెడ్‌క్రంబ్స్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి.
నూనె వేడెక్కాక ఈ మాంసం ఉండలను వేసి మీడియం మంట మీద దోరగా వేయించుకోవాలి. గోధుమవర్ణం వచ్చేదాకా వేయించుకునితరువాత తీసేయాలి.
నూనె వేడెక్కాక ఈ మాంసం ఉండలను వేసి మీడియం మంట మీద దోరగా వేయించుకోవాలి. గోధుమవర్ణం వచ్చేదాకా వేయించుకునితరువాత తీసేయాలి.
ఇప్పుడు వీటిని తీసి బేకింగ్ ట్రేలో పెట్టి 180C 360F వద్ద 10 నుండి 20 నిమిషాల పాటు ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో పెట్టాలి. ఆ తరువాత ఓవెన్ లో నుంచి తీసి కాస్త చల్లారాక పిటా బ్రెడ్, సలాడ్, టమోటా సల్సాతో ఈ టేస్టీ టేస్టీ మీట్‌బాల్స్ సర్వ్ చేయండి.