వేసవి వచ్చిందంటే.. సెలవులు, మామిడి పండ్లు, పెండ్లీలు..లాంటి హడావుడితో పాటు ఉక్కబోతనూ మోసుకువస్తుంది. ఓ వైపు వేడి, చెమట... మరోవైపు కుమ్ములో పెట్టినట్టుగా ఉక్కబోత.. వీటిని తట్టుకుని.. ఈ వేసవినుండి బయటపడాలంటే శరీరం నీటిని కోల్పోకుండా కాపాడుకోవాలి.
undefined
తినే ఆహారంలో ఎక్కువగా నీరు, పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చాలి. మసాలాలు, వేపుళ్లకు దూరం ఉండాలి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.
undefined
అప్పుడే ఎంత చెమట పట్టినా.. ఆ రూపంలో ఒంట్లోనుంచి నీరు పోయినా అది మళ్లీ రీఫిల్ అవుతుంది. మీరూ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నీరు కోల్పోవడం వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
undefined
వేసవిలో రెగ్యులర్ గా తీసుకునే కొబ్బరినీళ్లు, నిమ్మకాయరసం, జ్యూసులు, నీళ్లతో పాటు మీ ఆహారంలో మరికొన్ని పండ్లు, కూరగాయలను చేరిస్తే ఈ వేసవిని వణికించొచ్చు.
undefined
పుచ్చపండు : 92 శాతం నీటితో తయారవుతుంది. సో డీహైడ్రేషన్ కాకుండా అద్భుతంగా పనిచేస్తుంది.
undefined
దీంట్లోని లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి 6, మరియు సి, పొటాషియం, అమైనో ఆమ్లాలు శరీరంలోని లవణాలు, పోషకాలు కోల్పోకుండా చేస్తాయి.
undefined
దోసకాయ : కీరా దోసకాయ వేసవిలో తప్పక తినాల్సిన ఆహారం. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించి.. శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
undefined
దీంతోపాటు దీంట్లో అధికంగా ఉండే నీటి శాతం, ఖనిజపోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.
undefined
సెలెరీ : కొత్తిమీరలాంటి ఆకు కూర. ఈ ఆకుకూరలో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఇది శరీరానికి అవసరమైన నీటిని సమృద్ధిగా అందిస్తుంది.
undefined
దీన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చండి. దీన్ని కూరల్లోనూ, సలాడ్స్ లోనూ కలపడం వల్ల మీకు కావాలసిన పోషకాలు అందుతాయి.
undefined
పెరుగు : వేసవిలో మజ్జిగ దివ్యౌషధం. కాస్త కొత్తిమీర, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే శరీరానికి ఎంతో ఎనర్జీ వస్తుంది. లేదా మజ్జిగలో చిటికెడు ఉప్పు, ఓ చెంచాడు చక్కెర వేసుకుని తాగితే శరీరానికి ఓఆర్ఎస్ లా పనిచేస్తుంది.
undefined
లేదంటే.. పెరుగును చక్కగా కూల్ చేసుకుని స్నాక్ ఐటమ్ లా తినేయచ్చు. ఒట్టిది తినబుద్ది కాకపోతే కాస్త చక్కెర కలుపుకుని లాగించినా సరిపోతుంది.
undefined
కాలీఫ్లవర్ : మీరు చదివింది నిజమే కాలీఫ్లవర్. ఇ్ీ క్రూసిఫరస్ వెజ్జీస్ కుటుంబానికి చెందింది. ఇందులో విటమిన్ సితో పాటు అనేక ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
undefined
కాలీఫ్లవర్ : మీరు చదివింది నిజమే కాలీఫ్లవర్. ఇ్ీ క్రూసిఫరస్ వెజ్జీస్ కుటుంబానికి చెందింది. ఇందులో విటమిన్ సితో పాటు అనేక ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
undefined