గర్భిణులు తప్పక తినాల్సిన కొన్ని ఆహారాలు

First Published | Jun 16, 2023, 4:39 PM IST

గర్భంతో ఉన్నప్పుడు కొన్ని పోషకాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తల్లినీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బిడ్డ ఎదుగుదలను మెరుగ్గా ఉంచుతాయి. 
 

ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో ఆడవారి శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. అలాగే మానసిక స్థితి దెబ్బతింటుంది. దీంతో పాటుగా వికారం, జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలన్నీ చాలా సహజమే. కానీ ఇవన్నీ ఆకలి తగ్గడానికి దారితీస్తాయి. కానీ గర్బిణులు మొదటి మూడు నెలల పాటు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలి. 
 

మొదటి త్రైమాసికంలో స్త్రీల లోపల పెరిగే పిండానికి శక్తి అవసరం. కాబట్టి  ఆ సమయంలో ముఖ్యమైన పోషకాలు కలిగిన సింపుల్ డైట్ ను తీసుకోవడం అలవాటు చేసుకోండి. గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం 2000 కేలరీలు తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.  గర్భిణులు తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవి శిశువు శారీరక ఎదుగుదలకు, మానసిక స్థితికి సహాయపడతాయి. ఇందుకోసం గర్బిణులు ఏయే పోషకాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్ మొదటి త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన అత్యంత ముఖ్యమైన పోషకం. ఈ పోషకం తల్లితో పాటుగా బిడ్డకు కూడా అవసరం. ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలేట్ గర్భధారణ సమయంలో న్యూరల్ రబ్ రుగ్మతలను నివారించడానికి అవసరం. 
 

ప్రోటీన్

తల్లీ బిడ్డ ఇద్దరికీ కండరాల పెరుగుదలకు ప్రోటీన్ చాలా చాలా అవసరం. ప్రోటీనన్ చికెన్, గుడ్లు, పెరుగు వంటి కొన్ని ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది. 

calcium

కాల్షియం

పిల్లల ఎముకలు, దంతాల పెరుగుదలకు కాల్షియం చాలా ముఖ్యం. మొదటి త్రైమాసికంలో తల్లి తీసుకునే కాల్షియం పరిమాణం భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ మీలో కాల్షియం లోపం ఉంటే పిల్లలకు ఎముకల సమస్యలు వస్తాయి. అలాగే తర్వాత బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధిత వ్యాధులు వస్తాయి. 
 

ఇనుము

గర్భిణులు మొదటి త్రైమాసికంలో ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా పుష్కలంగా తినాలి. రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ శరీరానికి అందాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

విటమిన్ సి

తల్లి, బిడ్డ ఇద్దరికీ విటమిన్ సి చాలా అవసరం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది ఎముకలు, కణజాల అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఇనుము శోషణను పెంచుతుంది. స్ట్రాబెర్రీలు, నారింజ, బ్రోకలీ వంటి ఆహారాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

click me!