Published : Aug 16, 2025, 09:47 AM ISTUpdated : Aug 16, 2025, 11:36 AM IST
చాలా మంది పూరీలను ఇష్టంగా తింటుంటారు. కానీ పూరీలు మనం అనుకున్నంత పర్ఫెక్ట్ గా మాత్రం రావు. అంటే గట్టిగానో, ఆయిలీ ఆయిలీగానో వస్తుంటాయి. ఏం చేస్తే పూరీలు మెత్తగా, నూనె పీల్చుకోకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఏ పండుగ అయినా, దావత్ అయినా పక్కాగా ప్రతి ఇంట్లో పూరీలను తయారుచేస్తుంటారు. ఈ పూరీలను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఒక్కోసారి ఈ పూరీలు మరింత ఆయిలీగా అవుతాయి. అంతేకాకుండా ఎక్కువ క్రిస్పీగా అవుతాయి. మెత్తగా, సాఫ్ట్ గా రావు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం పూరీలను మెత్తగా, నూనె లేకుండా తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
27
పిండిని గట్టిగా కలపాలి
చాలా మంది పూరీ పిండిని చాలా మెత్తగా కలిపి పెడుతుంటారు. ఇలా మెత్తగా కలపడం వల్ల పూరీలు నూనెను ఎక్కువగా పీలుస్తాయి. అందుకే పిండిని ఎప్పుడు కలిపినా గట్టిగానే కలపాలి. పూరీ పిండిని మెత్తగా కలిపితే పూరీలు ఉబ్బవు. అలాగే మెత్తగా కూడా రావు.
37
పిండిలో కొంచె సెమోలినా కలపాలి
పూరీలు చేస్తున్నట్టైతే దాంట్లో రెండు టీ స్పూన్ల సెమోలీనా, మైదా పిండిని వేసి కలపండి. దీనివల్ల పూరీలు క్రిస్పీగా అవుతాయి. అలాగే నూనెను తక్కువగా పీల్చుకుంటాయి. అలాగే బాగా ఉబ్బుతాయి కూడా. అలాగే పిండిలో చిటికెడు చక్కెరను కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల పూరీలు మంచి రంగు వస్తాయి.
47
వేడి నీళ్లతో పిండిని కలుపుకోవాలి
పూరీ పిండిని ఎప్పుడూ కూడా గోరువెచ్చని నీళ్లతోనే కలుపుకోవాలి. దీనివల్ల పిండి బాగా కలుస్తుంది. అలాగే పూరీలు ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి. అలాగే పిండికి కొన్ని నార్మల్ వాటర్ ను కూడా కలపాలి.
57
15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి
పిండిని కలిపిన వెంటనే పూరీలను అప్పుడే చేసేయకూడదు. పిండిపై మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టండి. అలాగే ఖచ్చితంగా పిండి ముద్దకు కొద్దిగా నూనె కూడా రాయాలి. ఇది పూరీలు మెత్తగా రావడానికి దారితీస్తుంది. ఈ స్టెప్స్ ను గనుక ఫాలో అయితే మీరు చేసిన పూరీలు మెత్తగా వస్తాయి. బాగా ఉబ్బుతాయి. నూనెను అస్సలు పీల్చుకోవు.
67
పూరీ మరీ సన్నగా, మందంగా ఉండదు
పూరీలు బాగా ఉబ్బాలంటే మరీ పల్చగా, ఎక్కువ మందంగా ఉండకూడదు. పూరీలు ఎక్కువ పల్చగా ఉంటే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. అదే మందంగా ఉంటే పూరీలు లోపల పచ్చిగానే ఉంటాయి. బాగా వేగవు. అందుకే పూరీలను ఎప్పుడైనా సరే మీడియంగానే తయారుచేయాలి.
నూనె బాగా వేడి చేయాలి
పూరీలను ఎప్పుడూ కూడా చల్లని నూనెలో వేయకూడదు. దీనివల్ల పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. అలాగే ఉబ్బవు. నూనెను మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాతే పూరీలను వేసి కాల్చాలి. అలాగని నూనె మరీ ఎక్కువ వేడిగా ఉంటే పూరీలు కాలకుండానే మాడిపోతాయి. కాబట్టి నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ ను సిమ్ లో పెట్టడమో, ఆఫ్ చేయడమో చేయాలి.
77
poori
ఒకేసారి ఎక్కువ పూరీలు వేయించకూడదు
చాలా మంది ఒకేసారి ఒకటికంటే ఎక్కువ పూరీలను వేసి కాల్చుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎక్కువ పూరీలను ఒకేసారి కాల్చడం వల్ల అవి బాగా కాలవు. అలాగే ఉబ్బవు. దీనివల్ల అవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. రుచి కూడా బాగుండదు.
అదనపు నూనెను తొలగించండి
పూరీ ఫ్రై అయిన తర్వాత టిష్యూ లేదా అబ్జార్బెంట్ కిచెన్ న్యాప్కిన్స్ పైన వేయండి. దీనివల్ల పూరీలకు ఉన్న అదనపు నూనె తొలగిపోతుంది. అలాగే పొడిబారకుండా ఉంటాయి. అలాగే పూరీలు ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి. రుచిగా ఉంటాయి.