ఇంట్లో బల్లులను తరిమికొట్టాలా.. సింపుల్ చిట్కాలు ఇవే..!

First Published May 3, 2021, 1:41 PM IST

మనం పట్టించుకోము గానీ.. బల్లులు.. పాములకన్నా చాలా ప్రమాదం. అక్కడా.. ఇక్కడా కాదు.. బల్లులు ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడి నుంచి ఎలా ఇంట్లోకి వస్తాయో ఎవరికీ తెలీదు. కాబట్టి వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తరిమికొట్టాలి.
 

ఇంట్లో బల్లులు తిరుగుతున్నాయంటే ఎవరికైనా చిరాకే. అలా బల్లులను చూస్తుంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. అలా బల్లులు ఇంట్లో తిరగడం కూడా అంత మంచిదేమీ కాదు. ఈ బల్లులను తరిమికొట్టేందుకు మార్కెట్లోకి చాలా క్రీములు వచ్చాయి. అయితే.. వాటివల్ల.. మనకు కూడా ప్రమాదమే. చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే.. దానిని నోట్లో పెట్టుకోవడం లాంటివి చేస్తే చాలా ప్రమాదం. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. కొన్ని రకాల హోమ్ రెమిడీస్ తో సమస్యను పరిష్కరించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined
మనం పట్టించుకోము గానీ.. బల్లులు.. పాములకన్నా చాలా ప్రమాదం. అక్కడా.. ఇక్కడా కాదు.. బల్లులు ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడి నుంచి ఎలా ఇంట్లోకి వస్తాయో ఎవరికీ తెలీదు. కాబట్టి వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తరిమికొట్టాలి.
undefined
ఇంట్లో ఎప్పుడూ పాడైన ఫుడ్ ఉంచకూడదు. చాలా మంది మిగిలిపోయిన ఆహారాన్ని అలానే వదిలేస్తారు. దాని వల్ల పురుగులు, ఈగలు ఎలా వస్తాయో.. బల్లులు కూడా అలానే వస్తాయట. ఈ ఆహారం బల్లులను ఆకర్షిస్తుందట.
undefined
మిరియాలు( పెప్పర్ స్ప్రే).. మిరియాలు దంచి పెట్టినా.. లేదా పెప్పర్ స్ప్రే చల్లినా బల్లులు పోతాయట. వాటిని దాని ఘాటు వాసన తట్టుకోలేవట.
undefined
కోడి గుడ్డు పెంకులు.. మొక్కల చుట్టూ బల్లులు ఎక్కువగా ఉంటాయి. దీనికి కోడి గుడ్డు పెంకు ఆ మొక్కల దగ్గర పెట్టి ఉంచాలి. దీనివల్ల బల్లులు ఆ దగ్గరకు రావు
undefined
ఉల్లిపాయ రసం.. వెల్లుల్లి లాగే.. ఉల్లిపాయ రసం కూడా బల్లలకు అస్సలు నచ్చదట. అందకే ఉల్లిపాయ రసం చేసి.. దానిని బల్లులు తిరిగే ప్రాంతంలో స్ప్రే చేయాలి. అలా చేయడం వల్ల బల్లులు పారిపోతాయి.
undefined
వెల్లుల్లి.. దీని వాసన బల్లులకు అస్సలు నచ్చదు. వీటిని కనుక దంచి.. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెడితే.. అవి దరిదాపుల్లోకి కూడా రాకుండా పోతాయి.
undefined
చల్లటి నీరు.. మనకు దగ్గర్లో గోడమీద బల్లి వెళుతూ కనిపించిందే అనుకోండి.. వెంటనే దాని మీద చల్లటి నీరు పోయాలి. అప్పుడు అది వెంటనే కింద పడిపోతుంది. దానిని అప్పుడు మీరు తీసి.. బయటకు వెళ్లగొట్టే అవకాశం ఉంటుంది.
undefined
ఇంట్లో బల్లులు ఎక్కువగా కనపడే చోట కర్పూరం పొడి చేసి చల్లాలి. అలాగే పొడి చల్లలేని చోట కర్పూరం బిళ్ళలు పెడితే బల్లులు ఆ ఘాటు వాసనకి రావు. అలాగే ఆ ఘాటు వాసన పోయిన తరువాత మళ్ళి కొత్తవి వెయ్యాలి.
undefined
ఇంటి హల్లో లేదా బెడ్ రూమ్లో కనుక బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి అక్కడ నెమలి కన్ను ఉన్నది పెట్టాలి. అలాగే ఒకటి రెండు కాకుండా ఒక 4 లేదా 5 నెమలి కనులు ఉన్నవి పెడితే బల్లులు బయపడి ఆ చోటకి రావు. ఇంట్లో అక్కడక్కడ మిరియాలు చల్లిన సరే బల్లులు రావు.
undefined
లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి.ఆ వాసన వాటికి పడదు.లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో, అక్కడ కొన్ని చుక్కలు పోయండి. అలా కాదు అంటే లెమన్ గ్రాస్ ని అక్కడే వెలాడదీయండి.
undefined
click me!