రైస్ తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా? అసలు నిజం ఇదే..!

First Published | May 2, 2021, 11:34 AM IST

ఈ రోజుల్లో ఎవరైనా సరే.. బరువు తగ్గాలి అనగానే ముందు రైస్ ని పక్కన పెట్టేసి..డైట్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కఠిన వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు.

ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా చేసే పని రైస్ తినడం మానేస్తుంటారు. ఎందుకంటే.. రైస్ తినడం వల్లే బరువు పెరుగుతారనే భ్రమలో చాలా మంది ఉంటారు. అయితే.. అందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. బియ్యం తినడం వల్లే బరువు నియంత్రణలో ఉంటారట. రైస్ తినడం వల్ల ఎలా బరువు కంట్రోల్ లో ఉంటారా ఇప్పుడు చూద్దాం..
ఈ రోజుల్లో ఎవరైనా సరే.. బరువు తగ్గాలి అనగానే ముందు రైస్ ని పక్కన పెట్టేసి..డైట్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కఠిన వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు.

బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవ్వడం లో తప్పులేదు. అయితే.. ఆ డైట్ లో ఏం తీసుకోవాలి..? ఏం తీసుకోకూడదు అనే అవగాహన ఉండదు చాలా మందికి. దీని వల్ల రైస్ తినడం మానేసి.. దాని బదులు ఏది పడితే అది తినేస్తుంటారు. దాని వల్ల శరీరానికి కావాల్సిన కేలరీలు అందవు. దాని వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ప్యాకేజ్డ్ ఆహారం కన్నా.. రైస్ తినడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. బియ్యంలో కూడా ఫైబర్ ఉంటుంది. అది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అయితే.. రైస్ తక్కువ మొత్తంలో తీసుకోవడం ఉత్తమం.
తీసుకోవాల్సిన విధంగా రైస్ తీసుకుంటే.. శరీరంలో కొవ్వు పేరుకోదట. పైగా బరువు నియంత్రణలో పెట్టుకోవవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీ శరీరానికి 150గ్రాముల రైస్ అవసరమైతే.. దాని నుంచి మీ శరీరానికి కేవలం 500గ్రాముల కేలరీలు అందుతాయి. అలాకాకుండా 2000 కేలరీలు మీ శరీరానికి అవసరమైతే రైస్ క్వాంటిటీ పెంచకుండా.. అదనంగా సలాడ్, తక్కువ ఆయిల్ తో కుక్ చేసిన ఫిష్ ని తీసుకోవాలి. దీంతో.. క్యాలరీలు బ్యాలెన్స్ అవుతాయి.
ఇలా తీసుకుంటే.. బరువు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యం పాడు కాదు.. హెల్దీగా ఉంటారు.
డైటింగ్ చేస్తున్నవారు పూర్తిగా రైస్ ని దూరం పెట్టకూడదు. దానిని తీసుకుంటూనే కొన్ని రూల్స్ ఫాలో అయితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. బరువు కూడా తగ్గొచ్చని సూచిస్తున్నారు.

Latest Videos

click me!