మనం రోజూ అన్నం వండుకుంటూనే ఉంటాం. రోజూ చేసే పని అయినా.. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పొరపాటున నీళ్లు ఎక్కువ పోయడం వల్ల.. అన్నం మెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా మెత్తగా అయినప్పుడు.. అన్నం తినడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరు అయితే పడేస్తూ ఉంటారు. కానీ.. మెత్తగా అయిపోయిన అన్నాన్ని కూడా మనం నార్మల్ గా మార్చుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
rice
అన్నం మెత్తగా అయినప్పుడు వెంటనే గరిటె పెట్టి కదిలించకూడదు. దాని వల్ల మరింత మెత్తగా అవుతుంది. అలా కాకుండా.. ఆ అన్నాన్ని… వేరే ఏదైనా పెద్ద ప్లేట్ తీసుకొని.. దాని మీద ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద పెడితే తడి తొందరగా పోతుంది. లేదంటే.. కొద్దిగా నూనె కానీ, నెయ్యి కాని వేయాలి. అప్పుడు మళ్లీ అన్నం పొడిగా మారుతుంది.
స్టవ్ పై మరోసారి వేడి చేయడం వల్ల దానిలోని తడి మొత్తం పొగొట్టవచ్చు. తక్కువ మంట కింద ఈ మెత్తగా అయిన అన్నాన్ని ఉంచాలి. నెమ్మదిగా కదుపుతూ ఉంటే తడిపోయే అవకాశం ఉంటుంది. అయితే.. మాడిపోకుండా చూసుకోవాలి.
rice
బ్రెడ్ స్లైస్‌లను ఉపయోగించండి: అతిగా ఉడికిన బియ్యం ఉన్న పాత్రలో రెండు బ్రెడ్ స్లైస్‌లను ఉంచండి. బ్రెడ్ స్లైస్‌లు అదనపు నీటిని గ్రహించి, బియ్యాన్ని పొడిగా చేస్తాయి. కొద్దిసేపు వేడి చేసి, బ్రెడ్ స్లైస్‌లను తీసేయండి.