నల్ల మచ్చలున్న అరటిపండ్లు తినొచ్చా?

First Published Mar 19, 2024, 9:45 AM IST

రోజూ ఒక అరటిపండును తింటే బలంగా ఉంటాం. అలాగే ఎనర్జిటిక్ గా కూడా ఉంటాం. అందులోనూ ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. హెల్త్ పరంగా ఈ పండ్లే చేసే మేలు వల్ల చాలా మంది అరటిపండ్లను రోజూ తింటుంటారు. అయితే మచ్చలున్న అరటిపండ్లను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. కానీ వీటిని తింటే.. 

Bananas

పండ్లు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. కానీ అరటిపండ్లు మాత్రం చాలా తొందరగా పాడైపోతుంటాయి. వీటిని కొన్ని మూడు నాలుగు రోజులకే నల్లగా, మెత్తగా, ముఖ్యంగా అరటిపండ్లపై నల్లని మచ్చలు వస్తుంటాయి. ఇలాంటి వాటిని తినకుండా పారేస్తుంటారు చాలా మంది. ఎందుకంటే నల్లమచ్చలుంటే పాడైపోయాయని అనుకుంటారు. కానీ నల్లమచ్చలొచ్చిన అరటిపండ్లను తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తొక్కపై నల్లమచ్చలు ఉన్న అరటిపండ్లను తింటే మన ఆరోగ్యానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

టీఎన్ఎఫ్

అరటిపండు తొక్కపై నల్లటి మచ్చలు కుళ్లిపోవడానికి సంకేతం కాదు. ఇవి పాడైపోయినవని అర్థంకాదు. ఇలాంటి అరటి పండు బాగా పండిందని ఇది సంకేతం ఇస్తుంది. అరటి పండు తొక్కపై ఉండే నల్లమచ్చల్లోని టీఎన్ఎఫ్ క్యాన్సర్ తో పోరాడే పదార్థం. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. అందుకే ఈ పండును ఎంచక్కా తినొచ్చు. 
 

తేలికగా జీర్ణం 

బాగా పండిన అరటి పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయి. అరటిపండ్లు బాగా పండినప్పుడు వాటిలోని పిండి పదార్థాలు చక్కెరలుగా మార్చబడతాయి. ఈ పండ్లు చాలా ఈజీగా  జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. 

banana

నియంత్రిత కొలెస్ట్రాల్

అరటి పండు తొక్కపై ఉండే నల్ల మచ్చల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో అనవసరపు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

గుండెల్లో మంట

బాగా పండిన అరటిపండు యాంటాసిడ్ గా పనిచేస్తుంది. అలాగే  కడుపు ఆమ్లాలు, చికాకు నుంచి కూడా ఇలాంటి పండ్లు రక్షిస్తాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గుండెల్లో మంట త్వరగా తగ్గిపోతుంది. 
 

ఇమ్యూనిటీ 

బాగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మీరు అంటువ్యాధులు, సీజనల్, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే రోగాలకు దూరంగా ఉంటారు. 
 

అయితే బాగా పండిన అరటి పండ్లను డయాబెటీస్ పేషెంట్లు అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలోని పిండి పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అలాగే బాగా పండిన అరటిపండ్ల నుంచి చెడిపోయిన వాసన వచ్చినా కూడా అస్సలు తినకూడదు. 

click me!