నెయ్యిని ఎప్పుడు ఎలా తీసుకోవాలో మీకు తెలుసా?

First Published | Feb 13, 2024, 2:42 PM IST

చాలా రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. అయితే... మన ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలి అంటే... నెయ్యి ని ఎలా తీసుకోవాలో.. సద్గురు వివరించారు.

Image: Freepik

నెయ్యి దాదాపు అందరు ఇళ్లల్లో ఉంటుంది. నెయ్యి ఆరోగ్యానికి మంచిదనే విషయం కూడా అందరికీ తెలుసు.అందుకే దాదాపు అందరూ తమ ఆహారంలో నెయ్యిని భాగం చేసుకంటూ ఉంటారు. చిన్న పిల్లలకు అయితే.. ప్రతిరోజూ ఏదో ఒక ఆహారంలో నెయ్యి వేసి తినిపిస్తూ ఉంటారు. కానీ.. నెయ్యి నిజంగా తీసుకోవచ్చా.? అసలు ఏ సమయంలో తినాలి..? ఎలా తింటే.. ఆరోగ్యానికి మంచిది..? ఎప్పుడు తినాలి..?ఈ విషయాన్ని మనకు సద్గురు తెలియజేశారు. ఆయన మాటల్లోనే ఈ విషయం తెలుసుకుందాం..

నెయ్యి మన ఇండియన్ కల్చర్ లో భాగం. ఆహారంతో పాటు... ఆయుర్వేద చికిత్సలోనూ మనం భాగం చేసుకుంటూ ఉంటాం. చాలా రకాల చికిత్సలకు వాడతాం. చాలా రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. అయితే... మన ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలి అంటే... నెయ్యి ని ఎలా తీసుకోవాలో.. సద్గురు వివరించారు.


నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. మనకు అవసరమైన ప్రోటీన్ కూడా ఉంటుంది. బోన్ స్ట్రెంత్, కంటి చూపు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడుతుంది. అంతేకాదు నెయ్యి తీసుకుంటే అరుగుదల సమస్యలు రాకుండా ఉంటాయి. డయోరియా లాంటి సమస్యలు కూడా రావు.

నెయ్యిని కచ్చితంగా మన ఆహారంలో భాగం చేసుకోవాలని సద్గురు ఓ ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు,  కాలన్ హెల్త్ ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

అయితే... ఈ నెయ్యిని మనం పరగడుపున తీసుకోవాలట. పరగడుపున నెయ్యిని తీసుకోవడం వల్ల.. జీర్ణ సమస్యలు పరిష్కరమవ్వడంతో పాటు...  శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోవడానికి కూడా సహాయపడుతుందట. ఆ నెయ్యిని కూడా వేడి చేసి తీసుకోవాలట. ఈ విధానాన్ని ఓలియేషన్ అంటారట.. 

ఉదయాన్నే వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తీసుకున్నా లేదంటే.. డైరెక్ట్ గా స్పూన్ నెయ్యిని ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల  అలిమెంటరీ కెనాల్ కోసం, ప్రేగు  సాఫీగా పని చేయడంలో సహాయపడుతుంది. ఆహార వృధాను సులభంగా దాటిపోయేలా పెద్దప్రేగును శుభ్రపరచడానికి పని చేస్తుంది.


అయితే.. నెయ్యి ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని... వాటిని ఇతర ఫుడ్స్ తో కలిపి తీసుకోకూడదు. నెయ్యిని కార్బో హైడ్రేట్స్ లేదంటే షుగర్ తో కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే.. అది శరీరంలో ఫ్యాట్ గా మారుతుంది. అప్పుడు అది ఆరోగ్యానికి సహాయపడదు.

నెయ్యితో ఆరోగ్యం పొందాలి అంటే.. ఇలా షుగర్, కార్బో హైడ్రేట్స్ తో కాకుండా, గోరు వెచ్చని నీటితో పరగడుపున మాత్రమే తీసుకోవాలి. నీటితో తీసుకోలేం అనుకుంటే.. బ్లాక్ కాఫీలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా హెర్బల్ టీలో కలుపుకోవచ్చు. ఇవన్నీ డీటాక్సిక్ డ్రింక్స్ లా పనిచేస్తాయి.

Latest Videos

click me!