చుక్క నూనె వాడకుండా నీటితోనే పూరీ చేయచ్చు తెలుసా?

First Published | Feb 13, 2024, 12:15 PM IST

చుక్క నూనె కూడా వాడకుండా మనం పూరీలను ఇంట్లో తయారు చేయవచ్చు. ఆ నూనెకి బదులు నీళ్లు వాడొచచు. నమ్మసక్యంగా లేదా..? అయితే.. నూనె లేకుండా.. పూరీ ఎలా చేసేయాలో ఇప్పుడుచూసేయండి..
 


సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ లలో చాలా మందికి పూరీ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ ఎంత ఇష్టం ఉన్నా.. ఆయిల్ ఫుడ్ కదా.. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే భయంతో పూరీని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ... ఆయిల్ వేయించినా పూరీకి వచ్చే రుచి మరే బ్రేక్ ఫాస్ట్ కి రాదనే చెప్పాలి. అయితే.. చుక్క నూనె కూడా వాడకుండా మనం పూరీలను ఇంట్లో తయారు చేయవచ్చు. ఆ నూనెకి బదులు నీళ్లు వాడొచచు. నమ్మసక్యంగా లేదా..? అయితే.. నూనె లేకుండా.. పూరీ ఎలా చేసేయాలో ఇప్పుడుచూసేయండి..

ముందుగా.. మనం ఎప్పటిలాగా పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. కలుపుకనే సమయంలో కొద్దిగా ఉప్పు, వాము వేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత.. 15 నిమిషాలపాటు పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టేటప్పుడు కలిపి ఉంచుకున్న పిండిపై ఓ తడి క్లాత్ కప్పి ఉంచాలి.


ఇలా పక్కన పెట్టిన తర్వాత.... 15 -20 నిమిషాల తర్వాత.. పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.  ఈ లోగా ముందుగానే ఎయిర్ ఫ్రయ్యర్ ని ప్రీ హీట్ చేసుకోని ఉంచుకోవాలి. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేసి ఉంచుకోవాలి.

తర్వాత చిన్న ఉండలుగా చేసుకున్న పిండిని.. పూరీలు ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి. రోలర్ తో.. అన్నింటినీ పూరీల్లా చేసుకోవాలి. 

మరోవైపు ఒక ప్యాన్ తీసుకొని దానిలో వాటర్ పోయాలి. నీరు వేడిగా అయిన తర్వాత.. ఆ నీల్లలో ఈ పూరీలన్నంటినీ వేయాలి. ఒక నిమిషం పాటు నీళ్లలో వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. 
 

ఇప్పుడు నీళ్లలో వేగిన ఈ పూరీలను నీరు లేకుండా తీయాలి. తీసిన వాటిని ఎయిర్ ఫ్రయ్యర్ లో ఉంచాలి. ఎయిర్ ఫ్రయ్యర్ బాస్కెట్ లో ఉంచిన తర్వాత.. 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయిస్తే.. వేడి వేడిగా పొంగే పూరీలు రెడీ అయిపోతాయి.

చుక్క నూనె కూడా లేకుండా తయారు చేసిన ఈ పూరీలను మనం.. మనకు నచ్చిన కూరతో ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నూనె లేని పూరీలను ట్రై చేయండి.

Latest Videos

click me!