గులాబీ పండ్లు ఎప్పుడైనా చూశారా..? వాటి అరోగ్యప్రయోజనాలు తెలుసా?

First Published | Jun 16, 2021, 2:00 PM IST

రోజ్ హిప్స్ పేరు వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకీ రోజ్ హిప్స్ అంటే ఏమిటి?.. అంటే.. గులాబీ మొక్క పండ్లుగా చెప్పుకోవచ్చు. దీనిని రోజ్ హా అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ముదురు వంగపండు రంగులో లేదా బ్లాక్ కలర్ లో కూడా దొరుకుతాయి. 

రోజ్ హిప్స్ పేరు వింతగా, కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంతకీ రోజ్ హిప్స్ అంటే ఏమిటి?.. అంటే.. గులాబీ మొక్క పండ్లుగా చెప్పుకోవచ్చు. దీనిని రోజ్ హా అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. ముదురు వంగపండు రంగులో లేదా బ్లాక్ కలర్ లో కూడా దొరుకుతాయి.
undefined
మరి ఈ రోజ్ హిప్స్ ప్రయోజనాలేంటీ అంటే... దీంట్లో అనేక ఔషధ గుణాలున్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది, పొట్ట సంబంధిత సమస్యలు, వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
undefined

Latest Videos


క్యాన్సర్లకు : ఒక అధ్యయనం ప్రకారం, రోజ్ హిప్స్ ఎక్స్ ట్రాక్ట్ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించి, వాటి వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడులో క్యాన్సర్ పెరుగుదలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ పండ్లలో ఉన్న పాలీఫెనాల్స్ మనిషి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయని కనుగొనబడింది.
undefined
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజ్ హిప్స్ ఎక్స్ ట్రాక్ట్ క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. యాంటీ కొలెస్ట్రాల్ మందులకు ప్రత్యామ్నాయంగా రోజ్ హిప్స్ ను వాడడం సురక్షితంగా భావిస్తారు.
undefined
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది. 2008లో ఈ పండ్లమీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం రోజ్ హిప్స్ పౌడర్ నడుం, కీళ్ళు, మోకాళ్ళలో నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ పౌడర్ లో గోపో అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది ఆర్థరైటిక్ నొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
undefined
రోజ్ హిప్స్ పౌడర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. తద్వార డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
undefined
హృదయానికి మంచిది. రోజ్ హిప్స్ లో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి గుండె జబ్బుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
undefined
స్వీడన్ లోని ఎక్స్ పరిమెంటల్ మెడికల్ సైన్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజ్ హిప్ పౌడర్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది.
undefined
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఒక అధ్యయనంలో, రోజ్ హిప్ ఫ్రూట్ పై తోలు వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలకూ బాగా పనిచేస్తుంది.
undefined
రక్తపోటును నియంత్రిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధ్యయనం ప్రకారం, రోజ్ హిప్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తపోటు స్థాయిలను అదుపులో పెట్టవచ్చు. అలాగే, మీరు బిపి మందులు వాడుతున్నట్లైతే ఈ పండ్లు తీసుకునే ముందు మీ డాక్టర్ తో ఒకసారి మాట్లాడండి.
undefined
click me!