weight loss: రైస్ vs రోటి లో ఏది బెస్ట్..?

Published : Aug 31, 2021, 11:04 AM IST

మనమందరం చిన్నప్పటి నుంచి కొందరు రైస్ మాత్రమే తిని ఉంటారు. కొందరు..కంప్లీట్ గా రోటీ మాత్రమే తినే అలవాటు ఉంటుంది. అయితే.. బరువు తగ్గడం కోసం సడెన్ గా.. వాటిని తినడం మానేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

PREV
113
weight loss: రైస్ vs రోటి లో ఏది బెస్ట్..?

rice

బరువు తగ్గాలి అనుకునేవారు రైస్ తినడం మానేసి.. రోటీలు తినడం మొదలుపెడతారు.  అసలు.. బరువు తగ్గాలి అనుకునేవారు.. నిజంగా రైస్ తినడం మానేయాలా..? రోటీ తింటే.. బరువు తగ్గుతారా..? ఈ విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మరి దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

213

బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా వారు తీసుకునే ఆహారంలో  కార్బ్స్ తగ్గించాలట. అయితే.. మన భారత దేశంలో..  ఎక్కువగా కార్బ్స్ మాత్రమే తీసుకుంటారు. ఈ కార్బ్స్  రైస్ లోనూ.. అటు రోటీలోనూ ఉండటం గమనార్హం.

313
lemongrass rice

మనమందరం చిన్నప్పటి నుంచి కొందరు రైస్ మాత్రమే తిని ఉంటారు. కొందరు..కంప్లీట్ గా రోటీ మాత్రమే తినే అలవాటు ఉంటుంది. అయితే.. బరువు తగ్గడం కోసం సడెన్ గా.. వాటిని తినడం మానేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

413

అయితే.. బరువు తగ్గాలంటే ఆహారం తీసుకునే క్వాంటిటీని తగ్గించాలట. మీల్స్ లో కేవలం.. ఒకే రకం ఫుడ్ ని ఎంచుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

513

Roti and Weight loss


మనకు నచ్చిన ఏ ఆహారమైనా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అది అన్నమా, చపాతీనా అనేది పక్కన పెడితే.. మనం తృప్తిగా తిన్నామా లేదా అన్నది ముఖ్యమట. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని చెబుతున్నారు. ఇష్టంలేని ఆహారం బలవంతంగా తినడం వల్ల ఉపయోగం పక్కన పెడితే నష్టాలు ఎక్కువగా ఉంటాయట

613

బరువు తగ్గాలనుకునే వారు ముందు చేసే పని ఏమిటంటే.. వారు డైట్ మార్చేస్తారు. అంటే.. పూర్తిగా అన్నం తినడం మానేయడం.. లేదా చపాతీ తినడం మానేయడం లాంటివి చేస్తారు. అప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా అలవాటుగా తింటున్న ఆహారాన్ని ఒక్కసారిగా ఎవాయిడ్ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు

713

చపాతీ, అన్నం రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో ఉన్న పిండి పదార్ధం త్వరగా జీర్ణం అవుతుంది

813

ఆ రెండింటిలో ఉన్న తేడా సోడియం లెవల్స్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో చాలా తక్కువ సోడియం ఉంటే, బ్రెడ్, చపాతి (120 గ్రా పిండి) లో 190 మి.గ్రా సోడియం ఉంటుంది. మీరు మీ ఆహారంలో సోడియం తగ్గించాలనుకుంటే, మీరు బ్రెడ్ / చపాతీ తినడం మానేయవచ్చు
 

913
lemongrass rice

బియ్యం చపాతీ కంటే తక్కువ ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వు కలిగి ఉంటుంది, కాని బియ్యం లోని కేలరీలు చపాతీ కంటే ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పాటు, నీటిలో లభించే విటమిన్లు ఆరోగ్యానికి మంచివి మరియు సులభంగా జీర్ణమవుతాయి.

1013


చపాతీ శరీరానికి కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్ అందిస్తుంది. కానీ అన్నంలో కాల్షియం ఉండదు. అంతేకాదు పోటాషియం, పాస్పరస్ కూడా తక్కువగా ఉంటుంది.

1113

రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఉదయం టిఫిన్ చేసే సమయం వరకు మధ్యలో ఎక్కువ గంటల సమయం ఉంటుంది. అంటే.. ఆ సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోము
 

1213

lemon fried rice

కాబట్టి.. అన్నం తింటే త్వరగా అరిగిపోయి మళ్లీ ఆకలివేస్తుంది. అదే చపాతి తింటే.. ఆకలి ఎక్కువ వేయదు. అంతేకాకుండా.. ప్రోటీన్స్ తక్కువ ఆహారంలో ఎక్కువ మొత్తంలో అందుతాయి

1313

ఆరోగ్యకరమైన డైట్ ఫాలోకావాలి అనుకునేవారికి అన్నం, చపాతి... రెండు తీసుకోవచ్చు.

కానీ.. బరువు తగ్గాలి అనుకునేవారికి చపాతి బెస్ట్ ఆప్షన్స్.

click me!

Recommended Stories