నెయ్యి ప్రతిరోజూ తినొచ్చా..? తింటే ఏం జరుగుతుంది..?

First Published | Aug 13, 2021, 10:31 AM IST

గుండె ఆరోగ్యంగా ఉండటానికీ.. మెదడు చురుకుగా పనిచేయడానికి సహకరిస్తుంది. దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉ:టాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయం  చేస్తుంది.
 

పూర్వం.. అందరూ భోజనం చేసేటప్పుడు కచ్చితంగా నెయ్యి తీసుకునేవారు. అందరి ఇళ్లల్లోనూ పాడి ఉండేది కాబట్టి.. స్వచ్ఛమైన నెయ్యి లభించేంది. దీంతో.. అందరూ దానిని తినేవారు. అయితే.. ఇప్పుడు.. నెయ్యి తింటే లావు అవుతామనే భయం పెరిగిపోయింది. దీంతో.. దానిని పక్కన పెట్టేశారు. నెయ్యి కన్నా.. రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం ఉత్తమమని వారు భావిస్తున్నారు.
నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుందని భయపడుతున్నారు. అయితే.. నిజానికి నెయ్యి తీసుకోవడం చాలా ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అసలు ప్రతిరోజూ నెయ్యి తీసుకోవచ్చా..? తీసుకుంటే.. ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

నెయ్యిలో కొవ్వు ఉంటుంది. అయితే.. అది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. విటమిన్ ఏ, ఈ, కే, డి లు పుష్కలంగా ఉంటాయి. ఈ నెయ్యి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అంతేకాకుండా.. గుండె ఆరోగ్యంగా ఉండటానికీ.. మెదడు చురుకుగా పనిచేయడానికి సహకరిస్తుంది. దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉ:టాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయం చేస్తుంది.
మల బద్దకంతో బాధపడేవారు.. దీనిని తీసుకోవడం చాలా మంచిది. జీర్ణ సమస్యలు తగ్గించడానికి సహాయం చేస్తుంది. అలెర్జీలు, ఫ్లూ, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయం చేస్తుంది.
అయితే.. నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చాలా మంది భయపడిపోతారు. అయితే.. ఏదైనా అమితంగా తీసుకోవడం ప్రమాదమే అని గుర్తించాలి. అయితే.. నెయ్యి మితంగా తీసుకోవడ వల్ల గుండె ఆరోగ్యం మెరుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి, నెయ్యిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి, ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహకరిస్తుంది. అందుకే ఎక్కువ తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి. మితంగా తీసుకున్నంత వరకు మాత్రం దీని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని సూచిస్తున్నారు.
ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ ఆహారంలో రెండు, మూడు స్పూన్ల నెయ్యిని తీసుకోవచ్చట. అది చాలా మంచిది చేస్తుంది. అయితే.. దీనిని డైరెక్ట్ గా కాకుండా.. వంట వండే సమయంలో నెయ్యిని ఉఫయోగించవచ్చట.

ghee general

Latest Videos

click me!