మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయా..?

First Published Aug 11, 2021, 1:20 PM IST

ప్రోటీన్  పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే.. ఎముకలు బలంగా ఉంటాయి. బరువు కంట్రోల్ లో ఉంటుంది. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఉదయాన్న లేవగానే కడుపులో ఎంత కొంత ఆహారం పడనిది ఏ పనీ చేయలేం. ముందు ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదా.. ఆ శక్తి మనకు అల్పాహారం అందిస్తుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో లభించే అన్ని వెరైటీ అల్పాహారాలు మరెక్కడా దొరకవు. నార్త్ ఇండియాలో మహా అయితే.. వడాపావ్, మసాలా పావ్ అంటూ బ్రెడ్ లేదంటే పోహ లాంటివి తింటారు. కానీ... దక్షిణ భారత దేశంలో మాత్రం బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ చాలా పెద్దదనే చెప్పాలి.

breakfast

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా అశ్రద్ధ చూపిస్తారు. దానివల్ల తీవ్ర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి.. బ్రేక్ పాస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే.. ఎముకలు బలంగా ఉంటాయి. బరువు కంట్రోల్ లో ఉంటుంది. మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ప్రోటీన్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

breakfast

1. మొలకల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అవి త్వరగా జీర్ణమౌతాయి కాబట్టి.. ఉదాయన్నే అల్పాహారం సమయంలో మొలకెత్తిన గింజలుు తీసుకోవడం ఉత్తమం. కాబట్టి. వీటిని మీ అల్పాహారంలో కచ్చితంగా చేర్చాలి.

Sprouts

2. బాదం పప్పు, వాల్ నట్స్, జీడి పప్పు లలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, బీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. రోజూ వీటిని తీసుకోవాలి. పరగడుపున వీటిని అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతమౌతుంది.

nuts

3.అల్పాహారంలో ఓట్స్ తీసుకోవాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రతిరోజూ ఉదయాన్నే కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఇది హై కొలిస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనిలో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
undefined
4.ఇక డైరీ ప్రొడక్ట్స్ చీజ్, పెరుగు లోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు.
undefined
5.ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్ కోడిగుడ్డు. కాగా.. ఎగ్ వైట్ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారట. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది. ఒక మనిషి వారి బరువును పట్టి 60-90 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. అది గుడ్డు ద్వారా అందుతుంది.
undefined
click me!