ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ కరోనా వైరస్ ఎంటరయ్యాక ఆ జాగ్రత్తలు మరింత ఎక్కువయ్యాయనే చెప్పాలి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం.. దానికి తగ్గట్టు వ్యాయామం, యోగా లాంటివి చేయడం తమ జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు
undefined
జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ.. బరువుని నియత్రణలో పెట్టుకోవడానికి కూడా వారు చేయని పనులంటూ లేవు. అయితే.. నిజంగా బరువు తగ్గాలి అనుకునేవారికి రాత్రి పూట అన్నం తినడం.. చపాతి తినడం ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో తెలీక తికమకపడుతుంటారు. మరి దీనికి నిపుణులు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
మనకు నచ్చిన ఏ ఆహారమైనా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అది అన్నమా, చపాతీనా అనేది పక్కన పెడితే.. మనం తృప్తిగా తిన్నామా లేదా అన్నది ముఖ్యమట. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని చెబుతున్నారు. ఇష్టంలేని ఆహారం బలవంతంగా తినడం వల్ల ఉపయోగం పక్కన పెడితే నష్టాలు ఎక్కువగా ఉంటాయట.
undefined
బరువు తగ్గాలనుకునే వారు ముందు చేసే పని ఏమిటంటే.. వారు డైట్ మార్చేస్తారు. అంటే.. పూర్తిగా అన్నం తినడం మానేయడం.. లేదా చపాతీ తినడం మానేయడం లాంటివి చేస్తారు. అప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా అలవాటుగా తింటున్న ఆహారాన్ని ఒక్కసారిగా ఎవాయిడ్ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
చపాతీ, అన్నం రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో ఉన్న పిండి పదార్ధం త్వరగా జీర్ణం అవుతుంది.
undefined
ఆ రెండింటిలో ఉన్న తేడా సోడియం లెవల్స్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో చాలా తక్కువ సోడియం ఉంటే, బ్రెడ్, చపాతి (120 గ్రా పిండి) లో 190 మి.గ్రా సోడియం ఉంటుంది. మీరు మీ ఆహారంలో సోడియం తగ్గించాలనుకుంటే, మీరు బ్రెడ్ చపాతీ తినడం మానేయవచ్చు.
undefined
బియ్యం చపాతీ కంటే తక్కువ ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వు కలిగి ఉంటుంది, కాని బియ్యం లోని కేలరీలు చపాతీ కంటే ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పాటు, నీటిలో లభించే విటమిన్లు ఆరోగ్యానికి మంచివి మరియు సులభంగా జీర్ణమవుతాయి.
undefined
చపాతీ శరీరానికి కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్ అందిస్తుంది. కానీ అన్నంలో కాల్షియం ఉండదు. అంతేకాదు పోటాషియం, పాస్పరస్ కూడా తక్కువగా ఉంటుంది.
undefined
రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఉదయం టిఫిన్ చేసే సమయం వరకు మధ్యలో ఎక్కువ గంటల సమయం ఉంటుంది. అంటే.. ఆ సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోము.
undefined
కాబట్టి.. అన్నం తింటే త్వరగా అరిగిపోయి మళ్లీ ఆకలివేస్తుంది. అదే చపాతి తింటే.. ఆకలి ఎక్కువ వేయదు. అంతేకాకుండా.. ప్రోటీన్స్ తక్కువ ఆహారంలో ఎక్కువ మొత్తంలో అందుతాయి.
undefined
ఆరోగ్యకరమైన డైట్ ఫాలోకావాలి అనుకునేవారికి అన్నం, చపాతి... రెండు తీసుకోవచ్చు.
undefined
కానీ.. బరువు తగ్గాలి అనుకునేవారికి చపాతి బెస్ట్ ఆప్షన్స్.
undefined