బియ్యం, గోధుమలకు బదులుగా వీటిని తింటే బ్లడ్ షుగర్ తగ్గుతుంది

First Published | May 16, 2024, 3:52 PM IST

డయాబెటిస్ ఉన్నవారు వీలైనంత వరకు అన్నం తినకపోవడమే మంచిది. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో పెరిగితే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

డయాబెటిస్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ వ్యాధి. మధుమేహం ఒక జీవనశైలి వ్యాధి. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోలేం. కేవలం నియంత్రించగలం అంతే. మధుమేహాన్ని నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆహారం విషయంలో మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు వీలైనంత వరకు అన్నం తినకుండా ఉండాలి. ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర బరువును పెంచడంతో పాటుగా, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.

diabetes

అయితే డయాబెటిస్ ఉన్నవారు కూడా బియ్యం, గోధుమలతో చేసిన ఆహారాలను తింటుంటారు. కానీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అయితే డయాబెటీస్ పేషెంట్లు బియ్యం, గోధుమలకు బదులుగా తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారాలను తినాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. అవేంటంటే?


1. ఓట్స్

ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది బరువును తగ్గించడంతో పాటుగా పొట్టను, గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అందుకే అన్నం, చపాతీలకు బదులు ఓట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గి బరువును కంట్రోల్ లో ఉంటుంది. 

Image: Getty Images

2. బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైంది. దీనిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే బరువు పెరుగుతుంది అన్న భయం కూడా ఉండదు. బ్రౌన్ రైస్ ఆకలిని నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, డయాబెటిస్ ను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
 

3. బార్లీ

బార్లీ కూడా డయాబెటీస్ పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బార్లీని మధ్యాహ్నం పూట తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆకలి కూడా చాలా మటుకు తగ్గుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 
 

4. బాదం ఫ్లోర్

బాదం పప్పులను గ్రైండ్ చేసి ఉపయోగించడం వల్ల కూడా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

vegetables

5. కూరగాయలు, పప్పుధాన్యాలు

ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండే కూరగాయలు, పండ్లు కూడా డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే బియ్యానికి బదులుగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే చిక్కుళ్లను తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

Latest Videos

click me!