ఎండు ఖర్జురా.. నానపెట్టిమరీ ఎందుకు తినాలో తెలుసా?

First Published | Jul 15, 2024, 1:35 PM IST

నార్మల్ ఖర్జురా అయినా కొందరు తింటూ ఉంటారు కానీ.. ఎండు ఖర్జురా మాత్రం పట్టించుకోరు. మోస్ట్ లీ వాటిని.. పూజలో తాంబూళం గా మాత్రమే వాడతారు. కానీ.. ఈ ఎండు ఖర్జురాలను రోజూ రెండింటిని నానపెట్టి తీసుకుంటే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఓసారి చూద్దాం...

dates

మనలో చాలా మందికి డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే.. డ్రై ఫ్రూట్స్  అంటే ఎవరైనా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లాంటివి తింటూ ఉంటారు.  ఎక్కువ మంది నిర్లక్ష్యం చేససే.. పెద్దగా పట్టించుకోని వాటిలో ఎండు ఖర్జూరా ముందుంటుంది. కానీ.. ఇదే ఎండు ఖర్జురా మనం ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుందని మీకు తెలుసా..?

Dry dates

నార్మల్ ఖర్జురా అయినా కొందరు తింటూ ఉంటారు కానీ.. ఎండు ఖర్జురా మాత్రం పట్టించుకోరు. మోస్ట్ లీ వాటిని.. పూజలో తాంబూళం గా మాత్రమే వాడతారు. కానీ.. ఈ ఎండు ఖర్జురాలను రోజూ రెండింటిని నానపెట్టి తీసుకుంటే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఓసారి చూద్దాం...


ఎండు ఖర్జురాలో విటమిన్లు, మినరల్స్, ఐరన్్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన బాడీని మంచిగా పని చేసేలా సహాయపడతాయి.  రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి, ఎముకలు బలంగా మారడానికి, మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడతాయి.

ఎప్పుడైనా మనకు పని ఎక్కువ అయినప్పుడు కాస్త నీరసంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఎండు ఖర్జురా తింటే..వెంటనే తక్షణ శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుంది. అదే.. రాత్రిపూట నీటిలో నానపెట్టి.. ఉదయాన్నే తింటే.. ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నీరసం అనే ఫీలింగ్ కూడా రాదు.

సాధారణంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు రోజూ ఉదయం ఈ రెండు ఎండు ఖర్జురాలను తింటే.. జీర్ణ సమస్యలు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్ పేగు ఆరోగ్యానికి సహాయపడతాయి. మలబద్దకం సమస్య అనేది ఉండదు.
 

అంతేకాదు.. ఈ ఎండు ఖర్జురాలో మనకు పొటాసియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.  ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. శరీరంలో కొలిస్ట్రాల్ లెవల్స్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

dates

చాలా మంది 60ఏళ్లు దాటిన తర్వాత..మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. చిన్న పిల్లలు సైతం కాల్షియం సరిగాలేక ఇబ్బంది పడతారు. వారు కనుక రోజూ రెండు ఎండు ఖర్జురాలను రాత్రంతా నానపెట్టి.. ఉదాయన్నే తింటే.. ఈ కీళ్ల నొప్పి సమస్యఉండదు.  ఎముక ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో రక్తంలేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు కూడా.. ఈ సమస్య నుంచి చాలా తొందరగా బయటపడతారు. హిమోగ్లోబిన్ లెవల్స్ పెరగడానికి సహాయపడతాయి.

ఈ రెండు ఖర్జురాలు కేవలం మనకు ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా అందిస్తాయి. రోజూ రెండు తినడం వల్ల.. చర్మం అందంగా మారుతుంది. తొందరగా వయసు పెరగదు. ముడతలు లాంటివి రాకుండా ఉంటాయి. 

Latest Videos

click me!